తెలంగాణలో కరోనా కేసులు దాదాపుగా తగ్గుముఖం పట్టాయి. ఫిబ్రవరి మొదట నుంచి క్రమంగా కేసుల సంఖ్య తక్కువగానే నమోదవుతున్నాయి. ఇప్పటికే తెలంగాణలో థర్డ్ వేవ్ అంతమైందని ఆరోగ్య శాఖ ప్రకటించింది. తాజాగా గడిచిన 24 గంటల్లో కేవలం 91 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఒక్క మరణం కూడా లేదు. ప్రస్తుతం తెలంగాణలో 1375 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం 99.31 శాతం రికవరీ రేటు ఉంది.
కరోనా ప్రారంభం అయినప్పటి నుంచి తెలంగాణలో ఇప్పటి వరకు 7,89,951 కరోనా కేసులు నమోదు అయ్యాయి. వీటిలో 7,84,465 మంది కరోనా బారి నుంచి కొలుకున్నారు. 4111 మంది మరణించారు. థర్డ్ వేవ్ ప్రారంభం తరువాత మరణాల రేటు చాలా వరకు తగ్గింది. ప్రజలు వ్యాక్సినేషన్ తీసుకోవడంతో మరణాల ప్రభావం దాదాపుగా లేదు. రానున్న కాలంతో రాష్ట్రంలో కేసుల సంఖ్య మరింతగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పటికే ఇండియా వ్యాప్తంగా కేసుల సంఖ్య 10 వేలకు దిగువనే నమోదవుతున్నాయి. మరణాల రేటు కూడా చాలా వరకు తగ్గింది.