పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల ప్ర‌భావం : ఓలా, ఉబ‌ర్ క్యాబ్ వినియోగ‌దారుల‌కు షాక్.. ఏసీ బంద్

-

తెలంగాణ రాష్ట్రంలోని ఓలా ఉబ‌ర్ క్యాబ్ వినియోగదారుల‌కు బిగ్ షాక్. ఒక నుంచి ఓలా, ఉబ‌ర్ ఎక్కితే ఏసీ ప‌ని చేయదు. ఈ నెల 29 నుంచి అన్ని ఓలా, క్యాబ్ ల‌లో ఏసీల‌ను బంద్ చేస్తున్న‌ట్టు తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ ఫాం వ‌ర్క‌ర్స్ యూనియ‌న్ ప్ర‌క‌టించింది. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగాయని ఆ యూనియ‌న్ ప్ర‌తినిధులు అన్నారు. పెరిగిన ఇంధ‌న ధ‌ర‌ల‌తో కార్ల‌ను న‌డ‌ప‌డ‌మే క‌ష్టంగా మారింద‌ని అన్నారు. ఇక ఏసీ తో కారును న‌డ‌ప‌డం సాధ్యం కాద‌ని ప్ర‌క‌టించారు.

పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు పెరిగ‌న స‌మ‌యాల్లో ఓలా, ఉబ‌ర్ సంస్థ‌లు కూడా త‌మ‌కు క‌మీషన్ రేట్ల‌ను పెంచ‌డం లేద‌ని తెలిపారు. ఓలా, ఓబ‌ర్ కు ప్ర‌తి కిలో మీట‌ర్ కు రూ.12 ఇస్తున్నార‌ని అన్నారు. అయితే ఏసీ ఉప‌యోగించాలంటే.. ప్రతి కిలో మీట‌ర్ కు రూ. 24 నుంచి రూ. 25 వ‌ర‌కు ఇవ్వాల‌ని తెలిపారు. కాగ తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం త‌మ స‌మస్య‌ల‌పై చొర‌వు చూపి క‌నీస ధ‌ర‌ల‌ను పెంచాల‌ని కోరారు.

Read more RELATED
Recommended to you

Latest news