చిత్తూరు బస్సు ప్రమాద ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు దేశ ప్రధాని మోడీ. బస్సు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరమని ప్రధాని నరేంద్ర మోడీ పేర్కొన్నారు. మృతులకు సంతాపం ప్రకటించారు ప్రధాని మోడీ. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలి ఆశిస్తున్నాని మోడీ పేర్కొన్నారు. బసు ప్రమాదంలో చనిపోయిన వాళ్లకు pmnrf నుంచి ఒక్కో కుటుంబానికి రెండు లక్షలు ప్రకటించారు.
అలాగే… క్షతగాత్రులకు 50 వేల రూపాయలను ప్రకటించిన మోడీ.. అందరికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. కాగా.. బస్సు ప్రమాద ఘటనలో పెళ్లి బృందానికి చెందిన పలువురు మరణించిన ఘటనపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.
ప్రమాదానికి కారణాలను, సహాయక చర్యలను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా కలెక్టర్, ఎస్పీలు సహాయక చర్యలను స్వయంగా పర్యవేక్షించారని వెల్లడించారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ.2 లక్షల చొప్పున సహాయం అందించాలని, అలాగే గాయపడ్డవారికి రూ. 50 వేల చొప్పున పరిహారం అందించాలన్నారు జగన్.