తెలంగాణ రాష్ట్రంలో రైతులు పండిస్తున్న వరి ధాన్యాన్ని వందకు వంద శాతం కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. అంతే కాకుండా ధాన్యం కొనుగోలు పై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలని నేటి ఉద్యమ బాట పట్టనుంది. అందుకోసం ఇప్పటికే కార్యచరణను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు. ఈ కార్యాచరణలో భాగంగా నేడు రాష్ట్రంలో ఉన్న రహదారులను దిగ్బంధం చేయనున్నారు. కాగ నేడు రాష్ట్రంలో ఉన్న ప్రధానమైన నాలుగు రహదారులను టీఆర్ఎస్ నేతలు దిగ్బంధం చేయనున్నారు. ఆ ప్రదేశాలు ఇవే..
దేశంలోనే అతిపెద్దది అయిన నాగపూర్ జాతీయ రహదారిపై కడ్తాల్, ఆదిలాబాద్ రెండు ప్రాంతాల వద్ద దిగ్బంధం చేయనున్నారు. అలాగే బెంగళూరు జాతీయ రహదారిపై భూతపూర్ వద్ద టీఆర్ఎస్ నేతలు దిగ్బంధం చేయనున్నారు. దీంతో పాటు విజయవాడ జాతీయ రహదారిపై కోదాడ, సూర్యాపేట, నకిరేకల్, చౌటుప్పల్ ప్రాంతాల్లో టీఆర్ఎస్ నాయకులు ఆందోళన చేయనున్నారు. ముంబయి జాతీయ రహదారిపై సంగారెడ్డి వద్ద హైవేను దిగ్బంధం చేయనున్నారు.