ఈ రెండు బ్యాంకులకు ఆర్బీఐ భారీ జరిమానా..!

-

తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా. ప్రైవేట్ రంగానికి చెందిన యాక్సిస్ బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌‌లకు భారీ జరిమానాని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా విధించింది. ఇక పూర్తి వివరాలలోకి వెళితే.. యాక్సిస్ బ్యాంక్‌పై రూ. 93 లక్షలు, ఐడీబీఐ బ్యాంక్‌పై రూ.90 లక్షలు పెనాల్టీ పడింది. దీనికి గల కారణం ఏమిటి అనేది చూస్తే..

లోన్స్, నో యువర్ కస్టమర్ సర్వీసెస్, సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లలో మినిమమ్ బ్యాలెన్స్ మెయింటెనెన్స్ నిబంధనల అతిక్రమణ నేపథ్యంలో యాక్సిస్ బ్యాంక్‌పై రూ. 93 లక్షలు పెనాల్టీ పడింది. ఇది ఇలా ఉంటే ఫ్రాడ్స్ అండ్ సైబర్ సెక్యూరిటీ రూల్స్‌ను క్రాస్ చేయడం వల్ల యాక్సిస్ బ్యాంక్‌కు ఆర్‌బీఐ జరిమానా విధించింది.

రిజర్వు బ్యాంక్ 2017 మార్చి 31, 2018 మార్చి 31, 2019 మార్చి 31 నాటికి రెండు బ్యాంకుల ఆర్థిక స్థితిగతులకు సంబంధించి సూపర్‌వైజరీ మూల్యాంకనం కోసం ఇటీవల చట్టబద్ధమైన తనిఖీలను నిర్వహించగా.. రిస్క్ అసెస్‌మెంట్ రిపోర్ట్, ఇన్‌స్పెక్షన్ రిపోర్ట్, సంబంధిత అన్ని కరస్పాండెన్స్‌లను చూసి వీటిల్లో బ్యాంకులు రూల్స్ ని క్రాస్ చేశాయని తెలిపింది.

స్టాక్ బ్రోకర్లకు మంజూరైన ఇంట్రాడే సౌకర్యాల విషయంలో సూచించిన మార్జిన్‌ను నిర్వహించడంలో యాక్సిస్ బ్యాంక్ ఫెయిల్ అయ్యింది. అకౌంట్ ఓపెనింగ్ సమయంలో డాక్యుమెంట్ల ధృవీకరణలో కూడా ఫెయిల్ అయ్యింది. అలానే రెండు రోజుల పాటు ఐడీబీఐ లో పలు మోసపూరిత లావాదేవీలు జరిగినట్లు తెలుస్తోంది. యాక్సిస్, ఐడీబీఐ బ్యాంకులకు జరిమానా వేసింది. అంతేకాకుండా ఆర్‌బీఐ వీటికి ఒక అవకాశం కల్పించింది. ఎందుకు జరిమానా విధించకూడదో కారణం తెలియజేయాలని అడగగా.. దీనిపై బ్యాంకుల ప్రతిస్పందనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాత ఈ విధింపు ఉంటుంది.

 

Read more RELATED
Recommended to you

Latest news