ఇమ్రాన్ ఖాన్ మంచి కమెడియన్… కపిల్ శర్మ షోకు వెళితే మంచిది: మాజీ భార్య సెటైర్లు

-

ప్రధాని పదవి కోల్పోయన తర్వాత పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు వెల్లవ మొదలైంది. స్వయంగా ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్ సెటైర్లు వేస్తున్నారు. ‘ఇమ్రాన్ ఖాన్ కపిల్ శర్మ షో’ కి వెళితే మంచిదని వ్యంగాస్త్రాలు సంధిస్తోంది. ఇమ్రాన్ ఖాన్ కు మంచి హస్య ప్రతిభ ఉందని… కపిల్ శర్మ షోలో నవజ్యోతి సిద్ధూ స్థానానికి మంచిగా సూట్ అవుతాడంటూ విమర్శించింది. పాక్ లో రాజకీయ సంక్షోభం మొదలైనప్పటి నుంచి ఇమ్రాన్ ఖాన్ పై విమర్శలు, సెటైర్లు వేస్తోంది ఆయన మాజీ భార్య రెహమ్ ఖాన్. గతంలో ‘ మిని ట్రంప్’ అంటూ విమర్శించింది. బాలీవుడ్ లో ఇమ్రాన్ ఖాన్ తన లక్ పరీక్షించుకుంటే మంచిదని సూచించింది. ఇమ్రాన్ ఖాన్ కు బాలీవుడ్ లో చోటు ఇవ్వాలని…. అతను ఎమోషనల్ అవుతూ.. ఆస్కార్ విన్నింగ్ ఫెర్ఫామెన్స్ చేస్తున్నారంటూ చురకలు అంటించింది. ఓ టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమ్ ఖాన్, ఇమ్రాన్ ఖాన్ పై సెటైర్లు పేల్చారు. అయితే బాలీవుడ్ లో హీరోనా, విలనా ఏది బాగుంటుందని ప్రశ్నించగా… బాలీవుడ్ లో హీరోలు విలన్లు అవుతుంటారని… విలన్లు బాగా పాపులర్ అని … అయితే ఇమ్రాన్ ఖాన్ కు మంచి కామెడీ టాలెంట్ ఉందంటూ వ్యాఖ్యానించింది.

Read more RELATED
Recommended to you

Latest news