భర్త నల్లగా ఉన్నాడని పెట్రోల్ పోసి తగులబెట్టిన భార్య..!

-

ప్రేమ్ శ్రీ అందగత్తె. సత్యవీర్ సింగ్ మాత్రం నల్లగా ఉంటాడు. దీంతో తన భర్త నల్లగా ఉంటాడని.. అందరూ తనను కామెంట్ చేస్తారని బాధ పడేది. ఎప్పుడూ అతడిని నువ్వు నల్లగా ఉంటావంటూ టార్చర్ చేసేది.

భార్యాభర్తల బంధం అనేది మామూలుది కాదు. అది జన్మజన్మల బంధం. ఒక్కసారి ఇద్దరు ఒకటయ్యాక వాళ్లు ఏ శక్తి విడదీయకూడదు. అందుకే.. భర్త.. భార్య మెడలో మూడు ముళ్లు వేస్తాడు. ఆ మూడు ముళ్లు ఇద్దరు బతికున్నంత వరకు వాళ్లను విడదీయకూడదని భర్త తన భార్య మెడలో ముళ్లు వేస్తాడు. కానీ.. నేతి తరం ఆధునిక, సాంకేతిక పోకడలను అందిపుచ్చుకొని భార్యాభర్తల బంధానికే విలువ లేకుండా చేస్తోంది అనడానికి ఇదే ఉదాహరణ.

wife sets husband on fire in uttar pradesh

ఓ భార్య.. తన భర్త అందంగా లేడని ఏకంగా అతడిపై పెట్రోల్ పోసి కాల్చేసింది. ఈ దారుణ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకున్నది. బరేలిలో ఉంటున్న ప్రేమ్ శ్రీ, సత్యవీర్ సింగ్ కు రెండేళ్ల కింద పెళ్లయింది. వీరికి ఓ పాప కూడా పుట్టింది. అయితే.. ప్రేమ్ శ్రీ అందగత్తె. సత్యవీర్ సింగ్ మాత్రం నల్లగా ఉంటాడు. దీంతో తన భర్త నల్లగా ఉంటాడని.. అందరూ తనను కామెంట్ చేస్తారని బాధ పడేది. ఎప్పుడూ అతడిని నువ్వు నల్లగా ఉంటావంటూ టార్చర్ చేసేది. అయినా… తన భార్యే కదా అని చెప్పి సత్యవీర్ సింగ్ ఏమీ అనకపోయేవాడు. కానీ.. ఎవరూ ఊహించని విధంగా… తన భర్త నల్లగా ఉండటాన్ని తట్టుకోలేని ప్రేమ్ శ్రీ.. అతడు పడుకున్నాక… అతడిపై పెట్రోల్ పోసి నిప్పంటించింది. దీంతో సత్యవీర్ సింగ్ మంటల్లో సజీవ దహనం అయిపోయాడు. ఈ ఘటనపై మృతుడి సోదరుడు హర్వీర్ సింగ్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Read more RELATED
Recommended to you

Latest news