టాలెంటెడ్ డైరెక్టర్ హరీశ్ శంకర్ నయా అవతారమెత్తాడు. ఇప్పటి వరకు సినిమాలకు పరిమితమైన ఈయన..తాజాగా డిజిటల్ ఎంట్రీ కూడా ఇచ్చేశాడు. ‘ATM వెబ్ సిరీస్’కు స్క్రిప్ట్‌ను హరీశ్ శంకర్ అందించగా, సిరీస్ ను టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు ప్రొడ్యూస్ చేస్తున్నారు.
ఈ వెబ్ సిరీస్ పూజా కార్యక్రమం సోమవారం ఘనంగా జరిగింది. తొలి ఎపిసోడ్ చిత్రీకరణ ప్రారంభమైంది. ఈ నెల 27 నుంచి షూటింగ్ స్టార్ట్ కానుంది. ‘బిగ్ బాస్’ ఫేమ్ సన్నీ వీజే ఈ ప్రాజెక్ట్ లో ఉన్నారు. మరోవైపున డైరెక్టర్ హరీశ్ శంకర్ తన బాస్ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ను మరోసారి డైరెక్ట్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే.
గతంలో ‘గబ్బర్ సింగ్’ వంటి ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన హరీశ్ శంకర్…ఇప్పుడు ‘భవదీయుడు భగత్ సింగ్’ టైటిల్ తో సినిమా చేస్తున్నారు. అయితే, ఈ సారి ఎంటర్ టైన్మెంట్ ను మించి మూవీ ఉండబోతుందని, సొసైటీకి మెసేజ్ ఇచ్చేలా పిక్చర్ ఉంటుందని టాక్.
ఈ మూవీకి పవన్ కల్యాణ్ ఫ్రెండ్ ఆనంద్ సాయి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ డైరెక్టర్. ‘హరిహర వీరమల్లు’ పిక్చర్ షూటింగ్ పూర్తి కాగానే, పవన్ కల్యాణ్ ‘భవదీయుడు భగత్ సింగ్’ సినిమా చేయనున్నారు.
My New Journey into digital world started today need all ur Blessings and Best Wishes 🙏🙏@ZEE5Telugu @DilRajuProdctns @HR_3555#HanshithaReddy pic.twitter.com/kowAJ0WQD2
— Harish Shankar .S (@harish2you) April 25, 2022