భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ : హరీష్ రావు

-

భవిష్యత్‌లో ప్రతి సంవత్సరం ఉద్యోగ క్యాలెండర్ విడుదల చేస్తామని తెలిపారు మంత్రి హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంలో పోటీ పరీక్షల ఉద్యోగార్థులకు ఉచిత భోజనం కార్యక్రమం, స్టడీ మెటీరియల్‌ ప్రారంభించారు మంత్రి హరీష్ రావు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జాబ్ స్పేస్ యాప్ ద్వారా ఎక్కడ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా మెసేజ్ ద్వారా తెలిసిపోతుందని, వ్రాత పరీక్షల ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2లో ఇంటర్వ్యూ లేకుండా పారదర్శకంగా ఉద్యోగ నియామకాలు నిర్వహిస్తామన్నారు.

TRS look towards the trouble shooter Harish Rao in Huzurabad

అంతేకాకుండా 500పైగా గ్రూప్ వన్ ఉద్యోగాల నోటిఫికేషన్స్ విడుదల చేయనున్నట్టు, గ్రూప్ 1లో కూడా 95శాతం స్థానికులకే ఉద్యోగాలు ఇస్తామని ఆయన వెల్లడించారు. కేంద్రం 15.65 లక్షల ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తుందో బండి సంజయ్ చెప్పాలని ఆయన డిమాండ్ చేసారు. 3 లక్షల ఉద్యోగాలు రైల్వేలో ఖాళీగా ఉన్నాయని, బీజేపీ నేతలను ప్రశ్నిస్తే సోషల్‌ మీడియాలో ట్రోలింగ్‌ చేస్తారని ఆయన మండిపడ్డారు. బీజేపీ డబుల్ ఇంజన్ గ్రోత్ ఎక్కడకి పోయింది..? అని ఆయన ప్రశ్నించారు. కేంద్రం ఉద్యోగాలు ఇస్తామంటే మీకే పాలాభిషేకం చేస్తామన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news