ఉచితంగా శిక్షణ.. నెక్స్ట్ జాబ్.. ఈ సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ పూర్తి వివరాలు మీకోసం..!

-

కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ని అందిస్తోంది. ఈ స్కీమ్స్ వలన చక్కటి లాభాలను మనం పొందొచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్య యోజన స్కీమ్ ని కూడా తీసుకు రావడం జరిగింది.

దీని వలన గ్రామీణ పేద కుటుంబాలకు బాసటగా ఉండచ్చు. అలానే గ్రామీణ ప్రాంత యువతకు ఉపాధి కల్పన లక్ష్యంతో ఈ పథకాన్ని 2014 సెప్టెంబర్ 25న తీసుకు వచ్చారు. ఈ స్కీమ్ కోసం పూర్తి వివరాల లోకి వెళితే.. కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ఈ పథకం దేశవ్యాప్తంగా అమలులో ఉంది. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ స్కీమ్ అమలు చేస్తున్నారు.

దీన్ దయాల్ స్కీమ్ వలన కలిగే లాభాలు:

పేద కుటుంబాలకు చెందిన 15 నుంచి 35 ఏళ్ల మధ్య వయసు కలిగిన గ్రామీణ యువతపై ప్రత్యేకంగా దృష్టిని కేంద్రం సారించింది. అయితే ఈ స్కీమ్ వలన ఎలాంటి లాభాలను పొందొచ్చు అనేది చూస్తే.. ప్లేస్‌మెంట్, రిటెన్షన్, కెరీర్ ప్రోగ్రెషన్, ఫారిన్ ప్లేస్‌మెంట్‌కు ప్రాధాన్యతనిస్తూ, ప్రపంచ ప్రమాణాలకు అనుగుణమైన శిక్షణా ప్రాజెక్ట్‌లకు నిధులు సమకూర్చడం లాంటివి ప్రభుత్వం చేస్తుంది. దీనితో వాళ్లకి చక్కటి ప్రోత్సాహం అవకాశం లభిస్తుంది.

దీన్ దయాల్ స్కీమ్ ఫీచర్లు:

శిక్షణ తీసుకున్న తర్వాత కనీసం 75 శాతం మందికి కచ్చితమైన ప్లేస్‌మెంట్ ఉంటుంది.
ఎలాంటి ఖర్చు లేకుండా నైపుణ్యాల శిక్షణ ని గ్రామీణ పేదలు పొందొచ్చు.
సామాజికంగా వెనుకబడిన కులాల వారికి ప్లస్ అవుతుంది.
ఉద్యోగం పొందిన అభ్యర్థులకు మద్దతు అందించడం.
శిక్షణ నుంచి కెరీర్ పురోగతికి ప్రాధాన్యతను మార్చడం. శిక్షణతో ఉపాధి కల్పన.

దీన్ దయాల్ స్కీమ్ అర్హతలు:

గ్రామీణ యువత వయసు 15 – 35 సంవత్సరాలు ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/మహిళలు/పీవీటీజీ/సీడబ్ల్యూడీ వారైతే 45 సంవత్సరాల వరకు ఉండచ్చు.

అధికారిక వెబ్‌సైట్: http://ddugky.gov.in/

Read more RELATED
Recommended to you

Latest news