సుధాకర్ హీరో కాకపోవడం వెనుక కారణం అదేనా.?

-

తెలుగు సినీ ఇండస్ట్రీలో ఎంతో మంది కమెడియన్లు అప్పట్లో ఇండస్ట్రీని ఏలిన విషయం తెలిసిందే. అయితే ఇటీవల కాలంలో వారికి అవకాశాలు లేక కొంతమంది ఇండస్ట్రీకి దూరమైతే.. మరికొంతమంది క్యారెక్టర్ ఆర్టిస్టుగా చేస్తున్నారు. ఇదిలా ఉండగా తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రముఖ కమెడియన్ సుధాకర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఒకప్పుడు సినిమా ప్రపంచంలో ఒక మెరుపు మెరిసిన గొప్ప కమెడియన్ అని చెప్పవచ్చు. ఇక ఎన్నో సినిమాలలో తన కామెడీతో.. విలనిజంతో ప్రేక్షకులను విపరీతంగా అలరించిన సుధాకర్ తెలుగుకంటే తమిళ్ లోనే ఎక్కువ సినిమాలలో నటించాడు.Comedian Sudhakar: కమెడియన్ సుధాకర్ తనయుడు బెన్ని టాలీవుడ్ లో ఎంట్రీ.. చిరంజీవిని కలిశా... అయితే..! | Comedian sudhakar about his health and sons benny entry in tollywood | TV9 Telugu

తమిళ సినీ ఇండస్ట్రీలో ఒక చరిత్ర సృష్టించిన ఈయన ఆరోజుల్లోనే రజినీకాంత్ లాంటి ఇమేజ్ ను సంపాదించుకోవడం గమనార్హం. అయితే స్టార్ హీరోగా ఎదిగాడనుకున్న సుధాకర్ ను అప్పట్లో తొక్కేశారు అని చాలా మంది అంటూ వుంటారు.. మంచి విజయాలను సొంతం చేసుకుంటూ సుమారుగా 100 సినిమాలకు పైగా హీరోగా నటించిన ఈయన ఉన్నటువంటి తన సినీ కెరీర్ లో పాతాళానికి పడిపోవడం వెనుక కొన్ని శక్తులు ఉన్నాయని అనేది వాస్తవం.. మెగాస్టార్ చిరంజీవి స్నేహితుడిగా కూడా  సుధాకర్ కు మంచి పేరు ఉంది. పెద్ద నటుడిగా పేరు తెచ్చుకున్న సుధాకర్ తమిళ సినీ ఇండస్ట్రీలో రాజకీయాల కారణంగా అక్కడి నుంచి తెలుగు పరిశ్రమకు వచ్చి కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా స్థిరపడిపోయారు.Comedian Sudhakar: Affair With Radhika .. Sudhakar Reveals The Real Truth About Coming Back Together .. Years Later

తెలుగు , తమిళ్ కలుపుకొని సుమారుగా ఆరు వందల చిత్రాలకు పైగా నటించిన సుధాకర్ హీరో కాక పోవడం వెనుక తమిళ సినీ ఇండస్ట్రీలో ఉన్న కొంత మంది సినీ ప్రముఖులు కారణమని ఇండైరెక్ట్ గా తెలుస్తోంది.ఇకపోతే ఆరోగ్య సమస్యల కారణంగా తెలుగు సినిమాలకు దూరం అయ్యాడు. సుధాకర్ దూకుడుకి తట్టుకోలేక ఎంజీఆర్, శివాజీ గణేశన్ వంటి స్టార్ హీరోలు కూడా షాక్ అయ్యారు.. అంతేకాదు ఇలా వదిలేస్తే తమ ఉనికికే ప్రమాదం అని భావించిన మరికొంతమంది మెల్లమెల్లగా సుధాకర్ ను తొక్కేయడం ప్రారంభించారు అని చెబుతూ ఉంటారు. ఇక డైరెక్టర్లు, నిర్మాతలు మూకుమ్మడిగా సుధాకర్ కు ఛాన్సులు రాకుండా చేసి ఆయనను హీరోగా కాకుండా అడ్డుకున్నట్లు గా కొంతమంది చెబుతూ ఉంటారు. నిజం ఏదైనా సరే ఒక గొప్ప హీరోని సినీ పరిశ్రమ కోల్పోయింది అని చెప్పవచ్చు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news