మరోవైపు బొత్స కూడా ఈ నియామకాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ఎందుకంటే ఆయన కూడా ఆర్.కృష్ణయ్య ఎంపికను బాహాటంగానే వ్యతిరేకిస్తున్నారు అని తెలుస్తోంది. ఆఖరి నిమిషం వరకూ అందరినీ ఉత్కంఠతలో ఉంచి, తరువాత నిర్ణయాలు వెలువరించడం అన్నది అంతగా మంచిది కాదని, జగన్ కు ఈ విషయమై పదే పదే తాము చెప్పినా, మీడియా స్పెక్యులేషన్ ను ఓ విధంగా ఆయనే ఎంకరేజ్ చేస్తున్నారని వైసీపీ మంత్రి ఒకరు వ్యాఖ్యానించారు అని తెలుస్తోంది. ఆ వైసీపీ మంత్రి కూడా ఉత్తరాంధ్రకు చెందిన కీలక నేతే కావడం గమనార్హం. ఏ విధంగా చూసినా ఉత్తరాంధ్ర వాకిట బీసీలకు లోటు లేకపోయినా, బీసీ నేతలకు వారి నాయకత్వ పటిమకు లోటు లేకపోయినా, తెలంగాణ ప్రభుత్వ సిఫారసు కానీ బీజేపీ సిఫారసు కానీ పనిచేసిన కారణంగానే జగన్ ఈ కీలక నిర్ణయం వెలువరించి, ఆర్.కృష్ణయ్య విషయమై ఇప్పుడు, దేవులపల్లి అమర్ ( ఏపీ సర్కార్ జాతీయ మీడియా సలహాదారు, ఢిల్లీ కేంద్రంగా లాబీయింగ్ చేసే జర్నలిస్టు) అప్పుడు విమర్శల పాలయ్యారు అన్నది సుస్పష్టం.
వామ్మో : బీసీ కోసం బీసీ సాయం.. మోడీనే ఆ హెల్ప్ చేశారా ?
-
ఆంధ్రావని వాకిట ప్రస్తుతం రాజ్యసభ ఎన్నికలకు సంబంధించి ఓ చర్చ వాడీవేడీగా జరుగుతోంది. ఈ చర్చల్లో అనూహ్యంగా మోడీ పేరు కూడా వినిపిస్తున్నది. ఓ విధంగా ఆశ్చర్యకరంగా ఉన్నా కూడా ఓ బీసీ కోసం మరో బీసీ నేత మాట సాయం చేసి ఉంటారన్న ఆలోచన ఒకటి వినిపిస్తున్నది. వినేందుకు నవ్వుగా ఉన్నా కాస్తో కూస్తో నిజం కావొచ్చు. ఆ విధంగా ఆర్ కృష్ణయ్యకు పీఎం మోడీ సాయం చేయవచ్చు. గుజరాతీ కుటుంబాల నుంచి ఎదిగివచ్చిన ఓబీసీ లీడర్ నరేంద్ర మోడీ ముందు నుంచి తమ కులం గురించి, వాటి నేపథ్యాల గురించి మాట్లాడుతూనే ఉన్నారన్నది ఓ సమాచారం. ఆ విధంగా చూసుకున్నా బీసీ నేతగా పేరున్న ఆర్.కృష్ణయ్య తనదైన లాబీయింగ్ లో భాగంగా బీజేపీ బాస్ ను కలిసి ఉండవచ్చని అందుకే జగన్ ఆయనకు అనుగుణంగానో అనుకూలంగానో పెద్దల సభకు పెద్ద దిక్కుగా ఆయన్ను ఎంపిక చేసి ఉండవచ్చని కూడా అంటున్నారు.