పాస్‌వర్డ్‌ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. కానీ మనలో చాలామంది మన పేరో, లేదా డేట్ ఆఫ్ బర్త్ నే తిప్పితిప్పి పెడతా ఉంటాం. కానీ అలాంటి పాస్‌వర్డ్‌లు పెట్టకూడదు. తాజాగా రొమాంటిక్ పదాలతో కూడిన పాస్‌వర్డ్‌లు మహిళలు ఎక్కువగా వాడుతున్నట్లు రిపోర్టులో తేలింది. దేశంలోని ప్రముఖల పేర్లతో కూడిన పాస్‌వర్డ్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయట.
2021లో ఎక్కువగా యూస్ చేసిన పాస్‌వర్డ్‌లు ఇవే : భారతీయులు ఎక్కువగా ‘123456’ లాంటి పాస్‌వర్డ్‌లను ఎక్కువగా ఉపయోగిస్తున్నారనే విషయం మనందరికే తెలిసిందే. కానీ, ఇలాంటివి భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ‘పాస్‌వర్డ్’ అని ఒక పరిశోధన వెల్లడించింది. టెక్నాలజీ పరంగా భారత్ దూసుకెళ్తున్నా, పాస్‌వర్డ్ విషయంలో మాత్రం వెనుకంజలోనే నిలిచింది. అయతే జపాన్ మాత్రం అత్యధిక రక్షణ కలిగిన పాస్‌వర్డ్‌లను ఏర్పరుచుకుంటున్నారని పరిశోధనలో తెలిసింది.
iloveyou, omsairam అత్యంత సాధారణ పాస్‌వర్డ్‌లు
ఎక్కువమంది వాడే పాస్‌వర్డ్‌లలో ‘iloveyou’, ‘krishna’, ‘sairam’, ‘omsairam’ ఉన్నాయట. నార్డ్‌పాస్ పరిశోధనలో ఇలాంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఈ వెబ్‌సైట్ పాస్‌వర్డ్‌లను ఎలా పెట్టుకోవాలో వినియోగదారులకు సహాయపడుతుంది. ప్రేమ పేర్లు భారతీయులు ఎక్కువగా వాడుతున్నారని తేలింది. అదే సమయంలో india123, abc123, 123456789, 12345678, 123123, qwerty, xxx, Indya123, abcd1234, 1qaz@WSX, 1qaz లాంటివి కూడా ఉన్నాయంట.
రొమాంటిక్ పదాలతో పాస్‌వర్డ్‌లు
రొమాంటిక్ పదాలతో కూడిన పాస్‌వర్డ్‌లు మహిళలు ఎక్కువగా వాడుతున్నారట. దేశంలోని ప్రముఖల పేర్లతో కూడిన పాస్‌వర్డ్‌లు కూడా బాగా ప్రాచుర్యం పొందాయి. ఇందులో ‘ప్రియాంక’, ‘సంజయ్’, ‘రాకేష్’ వంటి పేర్లు కూడా ఉన్నాయట. ‘iloveyou’, ‘స్వీట్‌హార్ట్’, ‘లవ్లీ’, ‘సన్‌షైన్’ వంటి పాస్‌వర్డ్‌లను తమ అకౌంట్లకు వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ముఖ్యంగా ఈ పాస్‌వర్డ్‌లు మహిళలే ఎక్కువగా వాడుతున్నారట.
ఇలాంటి పాస్‌వర్డ్‌లు సెకనులో హ్యాక్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయని, అత్యంత ప్రాచుర్యం పొందిన పాస్‌వర్డ్‌లు హ్యాక్ చేయడానికి సులభమైనవని పరిశోధనలో తేలింది. మొత్తంమీద భారత్‌లో ఉపయోగించే 200 పాస్‌వర్డ్‌లు 62 సెకనులోపు హ్యాక్ చేసేందుకు అనుకూలంగా ఉన్నాయంట.
పాస్‌వర్డ్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే
జీమెయిల్ నుంచి బ్యాంక్, యూపీఐ లావాదేవీల వరకు, కనీసం ఒక పాస్‌వర్డ్ అవసరం. వినియోగదారులు కనీసం 12 నుంచి 18 పాస్‌వర్డ్‌లను గుర్తుంచుకోవాలి. అందుకే చాలా మంది పాస్‌వర్డ్‌లను సులభంగా తయారు చేసుకుంటారు. తేలికగా గుర్తుండే పదాలను పాస్‌వర్డ్‌లుగా పెట్టుకుంటే మాత్రం హ్యాక్ చేయబడే అవకాశాలు లేకపోలేవు. దీన్ని దృష్టిలో ఉంచుకుని, సురక్షితమైన పాస్‌వర్డ్‌ను రూపొందించడంలో ఎలాంటి తప్పులను నివారించాలో తెలుసుకుందాం..
-పాస్‌వర్డ్‌లో కనీసం 10 నుంచి 15 అక్షరాలను ఉపయోగించాలి
-వర్ణమాల ఉన్న సంఖ్యలను కూడా ఉపయోగించండి.
-సాధ్యమైన చోట, ఓటీపీతో పాస్‌వర్డ్‌ను లింక్ చేసుకోవడం మంచింది.
-పాస్‌వర్డ్‌లో ఆల్ఫాబెటిక్ క్యాపిటల్‌ని ఉంచండి.
-అలాగే స్పెషల్ క్యారెక్టర్లు @, #, $, %, ^, &, * ని కూడా ఉపయోగించండి.
-మీ పాస్‌వర్డ్‌ని ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి.
పాస్‌వర్డ్ తయారిలో చేసే కామన్ మిస్టేక్స్ ఏంటి?
- సాధారణ పదాలతో పాస్‌వర్డ్‌లను పెట్టుకోవద్దు.
- పాస్‌వర్డ్‌లో 8 కంటే తక్కువ అక్షరాలను ఉపయోగించవద్దు.
- పాస్‌వర్డ్‌లో మీ పేరు, పుట్టిన తేదీని ఉపయోగించవద్దు.
- మీ పేరును పాస్‌వర్డ్‌గా పెట్టుకోకూడదు.
- మీ పాస్‌వర్డ్ గురించి ఎవ్వరికీ చెప్పకూడదు.
పాస్‌వర్డ్‌కు బదులుగా పాస్‌ఫ్రేజ్‌ని ఉపయోగించడం ద్వారా కూడా మీ డేటా, అకౌంట్‌ను రక్షించుకోవచ్చు. ఇతర పాస్‌వర్డ్‌లతో పోలిస్తే, వీటిని ఏర్పరచుకోవడం కూడా చాలా సులభం. కానీ, క్రాక్ చేయడం మాత్రం చాలా కష్టం. మీరు ఉంటున్న సిటీతో పాటు, facebook లోని మొదటి పదం, జీమెయిల్ మొదటి పదం వాడి ఆయా అకౌంట్లకు పాస్‌వర్డ్‌లను పెట్టుకుంటే చాలా భద్రంగా ఉంటాయి. అలాగే అవి ఏ అకౌంట్లవో కూడా చాలా తేలికగా గుర్తుంచుకోవచ్చు.ఇందులో మీ పుట్టిన తేదీ లేదా సంవత్సరం కూడా ఉంచుకోవచ్చు. ఇలాంటి పాస్‌వర్డ్‌లను తయారు చేసుకుంటే మన డేటాతో పాటు అకౌంట్లను కూడా చాలా సేఫ్‌గా ఉంచుకోవచ్చు.