ఇలాగైతే భారత్ తో టెస్లా ఫ్లాంట్ ఏర్పాటు చేయం… ఎలాన్ మస్క్ క్లారిటీ

-

టెస్లా కంపెనీ సీఈఓ భారత్ లో ఫ్లాంట్ ఏర్పాటు చేయడంపై  క్లారిటీ ఇచ్చారు. టెస్లా కార్ల పరిశ్రమ భారత్ కు వస్తుందా..? లేదా..? అనే దానిపై తన అభిప్రాయాన్ని వెల్లడించారు. భవిష్యత్తులో భారత్ లో టెస్లా కార్ల పరిశ్రమను ఏర్పాటు చేస్తుందా..? అని ఓ నెటిజెన్ అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తొలుత తమ కార్లను అమ్ముకోనివ్వుకోని, సర్వీసింగ్ చేసేందుకు అనుమతి ఇవ్వని దేశాల్లో తమ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేయం అని కుండబద్దలు కొట్టారు.

Elon-Musk
Elon-Musk

కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రాధాన్యత ఇస్తున్న వేల టెస్లా లవర్స్ కు మస్క్ కామెంట్స్ కాస్త నిరాశకే గురిచేశాయి. టెస్లాకార్లను దిగుమతి చేసుకుంటే అధిక సంకాలు చెల్లించాల్సి వస్తుంది. టెస్లా కార్ల కంపెనీని తమ దేశంలో స్థాపిస్తే తాము మంచి అవకాశాలు కల్పిస్తామని గతంలో కేంద్ర రోడ్డు రవాాణా శాక మంత్రి నితిన్ గడ్కరీ టెస్లాకు ఆఫర్ ఇచ్చాడు. చైనాలో తయారైన కార్లను ఇండియాలో అమ్ముకానీవ్వమని స్పష్టం చేశారు. గతంలో తెలంగాణ మంత్రి కేటీఆర్ తో పాటు కర్ణాటక, మహారాష్ట్ర, బెంగాల్ రాష్ట్రాలకు చెందని పలువురు మంత్రులు ఎలాన్ మస్క్ ను ఇండియాలో టెస్లాను స్థాపించాలని ఆహ్వానించారు.

Read more RELATED
Recommended to you

Latest news