అధానీ నిజమైన ప్రధాని: కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు

-

ప్రధాని నరేంద్ర మోడీ పై ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కేంద్ర ప్రభుత్వ కార్మిక, ఉద్యోగ వ్యతిరేక విధానాలను వ్యతిరేకిస్తూ వరంగల్ లో నిర్వహించిన బహిరంగ సభలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసి, ఉద్యోగులను బీజేపీ ప్రభుత్వం ఆగమాగం చేస్తోందని ఘాటు ఆరోపణలు చేశారు. మోడీ మిత్రుడు కాబట్టి ప్రముఖ పారిశ్రామికవేత్త అదానికి ఏడు ఎయిర్ పోర్టులు అమ్మారని మండిపడ్డారు.

లక్షల కోట్ల విలువైన ఎయిర్ ఇండియాను కేంద్రం వేల కోట్లకే అమ్మిందని, బొగ్గు గనులు, కరెంటు కంపెనీలు యావత్ దేశంలో ఉన్న అన్ని సంస్థలను అమ్మేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది అన్నారు కవిత. మొన్న ఇతర దేశ ప్రధాని లండన్ నుంచి వచ్చి ప్రధాని మోదీని కాకుండా నేరుగా అదానిని కలిశాడని, దేశ ప్రధాని మోడీ కాదని, ‘అదాని నిజమైన ప్రధాని ‘ అనే చర్చ ప్రపంచవ్యాప్తంగా జరుగుతోందని సంచలన ఆరోపణలు చేశారు. బిజెపి ఎన్నికలకు ముందు ఒక మాట ఎన్నికల తర్వాత మరో మాట అన్నారు. ప్రధాని మోదీ ఎన్నికల అప్పుడు ఎలక్షన్ మోడ్, లేకపోతే ఏరోప్లేన్ మోడ్ లో ఉంటారన్నారు కవిత.

Read more RELATED
Recommended to you

Latest news