ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న తెలంగాణలోని పదో తరగతి విద్యార్థులకు విద్యాశాఖ శుభవార్త చెప్పింది. తెలంగాణ పదో తరగతి ఫలితాలు జూన్ 30న విడుదల చేయనున్నట్లు తెలిపింది విద్యాశాఖ. ఈ మేరకు ఎస్సెస్సీ బోర్డు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. గురువారం ఉదయం 11:30 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి టెన్త్ ఫలితాలను విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు మే 23 నుంచి జూన్ 1వ తేదీ వరకు కొనసాగిన విషయం తెలిసిందే. ఇవాళ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలు విడుదలైన సంగతి తెలిసిందే.
అయితే.. నేడు విడుదల చేసిన ఇంటర్ ఫలితాలలో బాలికలదే పైచేయిగా నిలిచింది. ఈ సంవత్సరం కూడా బాలికలు ఇంటర్‌లో తమ సత్తా చాటారు. అయితే రెండు సంవత్సరాల తరువాత నేరుగా పదో తరగతి పరీక్షలు జరిగాయి. గత రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా పదో తరగతి పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులు ప్రమోట్ చేయబడ్డారు. అయితే ఈ సారి పదో తరగతి పరీక్షల ఫలితాలపై ఆసక్తి నెలకొంది.