డా.బీఆర్. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ డిగ్రీ, పీ.జీ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేశారు అధికారులు. 2022-23 విద్యా సంవత్సరానికి సంభందించిన అండర్ గ్రాడ్యుయేట్ ( UG ), పోస్ట్ గ్రాడ్యుయేట్ (PG), పీజీ డిప్లొమా, సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాల కోసం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) నోటిఫికేషన్ విడుదల చేసింది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూల్ లేదా AP/TS ఓపెన్ స్కూల్ సొసైటీ నుండి ఇంటర్మీడియట్ పూర్తి చేసిన అభ్యర్థులు UG కోర్సులలో నేరుగా ప్రవేశం పొందవచ్చు. అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు పూర్తి చేసిన వారు PG ప్రోగ్రామ్‌లలో ప్రవేశం పొందవచ్చు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, ట్యూషన్ ఫీజు చెల్లింపుకు జూలై 31 చివరి తేదీగా అధికారులు ప్రకటించారు.
విశ్వవిద్యాలయం వెబ్ పోర్టల్స్ www.braouonline.in, www.braou.ac.in లో అడ్మిషన్ ప్రాస్పెక్టస్ అందుబాటులో ఉంది. మరిన్ని వివరాల కోసం, 7382929570, 7382929580, 7382929590, 7382929600, సమాచార కేంద్రాలు 040-23680290/291/294/295లను సంప్రదించవలసిందిగా అధికారులు పెర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ట్యూషన్ ఫీజు చెల్లించే అవకాశాన్ని కోల్పోయిన పాత బ్యాచ్‌లు (సంవత్సరాల వారీగా), CBCS రెండవ & మూడవ సంవత్సరం, PG పాత బ్యాచ్‌ల విద్యార్థులు ఇప్పుడు TS/AP ఆన్‌లైన్/క్రెడిట్/డెబిట్ కార్డ్ ద్వారా తాజాగా జులై 31లోపు చెల్లించవచ్చని తెలిపారు.