బేగంపేట ఎయిర్ పోర్ట్ లో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధాని మోడీ కి స్వాగతం పలికారు. అనంతరం ఆయన బిజెపి నాయకులను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు చేశారు.” నేను ప్రధానికి స్వాగతం పలికాను. సీఎం స్వాగతం పలకాలని ప్రోటోకాల్ లో ఎక్కడా లేదు. మర్యాద అనేది ఇచ్చి పుచ్చుకోవాలి. భారత్ బయోటెక్ ప్రధాని వచ్చినప్పుడు ప్రోటోకాల్ అవసరం లేదా? అప్పుడు సీఎం కేసీఆర్ అవసరం లేదా? అప్పటినుండి గ్యాప్ నడుస్తుంది. గతంలోనే 2వ తేదీ యశ్వంత్ సిన్హా హైదరాబాద్ వస్తా అన్నారు. బీజేపీ ఆఫీస్ లో సీఎం కేసీఆర్ మీద ఫ్లెక్సీలు పెట్టిన తర్వాతే మేము పెట్టాము.
ఈ రోజు హైదరాబాద్ కు ఎంతోమంది పొలిటికల్ టూరిస్టులు వస్తూ ఉంటారు.. వీళ్ళు అంతే. యశ్వంత్ సిన్హా ర్యాలి అనేది మేము చూపించిన చిన్న శాంపిల్ మాత్రమే. ఎవరు ఎవరికి భయపడరు. ఈడి, సిఐడి, సిబిఐ ఉంది అని బీజేపీ వాళ్లు అంటున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఏర్పాటు అయిన ప్రభుత్వాన్ని మహారాష్ట్రలో కూల్చారు. మహారాష్ట్ర పరిస్థితి ఇక్కడ ఎలా ఉంటది. బిజెపి బలం ఎంత ఇక్కడ. దేశంలో ప్రజలు ముందస్తు ఎన్నికలు కావాలి అంటున్నారు… మేము రెడీగా ఉన్నాం. మా ప్లీనరీలో ఫ్లెక్సీ లకు ఫైన్లు వేశారు” అని అన్నారు మంత్రి తలసాని.