గ్రేటర్‌లో ‘సీట్ల’ పంచాయితీ: కమలం తేల్చాల్సిందే!  

-

తెలంగాణలో రోజురోజుకూ పుంజుకుంటున్న బీజేపీలో సీటు దక్కించుకునేందుకు నేతలు గట్టిగానే పోటీ పడుతున్నారు. నెక్స్ట్ తెలంగాణలో అధికారం సాధించే దిశగా వెళుతున్న బీజేపీలో సీటు దక్కితే విజయం ఖాయమని పలువురు నేతలు భావిస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే సీటు రిజర్వ్ చేసుకోవాలని చూస్తున్నారు. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో బీజేపీలో సీట్ల కోసం ఎక్కువ పోటీ ఉంది. ఎందుకంటే గ్రేటర్ లో బీజేపీ చాలా స్ట్రాంగ్ గా ఉంది. గత జి‌హెచ్‌ఎం‌సి ఎన్నికల్లో దాదాపు టీఆర్ఎస్ పార్టీకి గట్టి పోటీ ఇచ్చి…47 కార్పొరేటర్లని గెలుచుకుంది.

దీంతో గ్రేటర్లో అసెంబ్లీ సీటు దక్కితే విజయం ఖాయమని నేతలు భావిస్తున్నారు…అందుకే ఒక్కో సీటులో ఇద్దరు నుంచి ముగ్గురు నేతలు వరకు పోటీ పడుతున్నారు. గ్రేటర్లో పాతబస్తీ కూడా ఉంది…ఇక ఆ పరిధిలో ఉండే 7 సీట్లు ఎం‌ఐ‌ఎం చేతులో ఉన్నాయి..ఆ సీట్లని పక్కన పెట్టి మిగిలిన సీట్లపై బీజేపీ ఫోకస్ పెట్టింది. ఇక గ్రేటర్ లో ఫుల్ డిమాండ్ ఉన్న సీట్లలో జూబ్లీహిల్స్ ఒకటి. ఈ సీటు కోసం సీనియర్ నేత ఎన్‌వి సుభాష్ తో పాటు..లంకా దీపక్ రెడ్డి ట్రై చేస్తున్నారు.

ఇక అంబర్ పేటలో ఎలాగో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పోటీ చేయడం ఖాయం. ఖైరతాబాద్ సీటు కోసం మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కాచుకుని కూర్చున్నారు..ఇప్పటికే ఆయన సీటు ఫిక్స్ అయిందని తెలుస్తోంది…కానీ వయసు మీద పడుతుండటంతో..చింతల శిష్యుడు గోవర్ధన్ రెడ్డి సీటుపై ఆశలు పెట్టుకున్నారు. శేరిలింగంపల్లి సీటు కోసం యోగానంద్ తో పాటు బిక్షపతి యాదవ్ తనయుడు రవి యాదవ్ పోటీ పడుతున్నారు. మరోవైపు పటాన్ చెరు టిక్కెట్ దక్కించుకోవాలని మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ తో పాటు, శ్రీకాంత్ గౌడ్ ప్రయత్నిస్తున్నారు.

కూకట్ పల్లి సీటులో మాధవరం కాంతారావు, పన్నాల హరీష్ రెడ్డి మధ్య పోటీ ఉంది. ఇక కుత్బుల్లాపూర్ సీటు కూన శ్రీశైలం గౌడ్ కు దాదాపు ఖాయమైనట్లే. అటు భరతసింహారెడ్డి సైతం ఈ సీటుపై కన్నేశారు. మల్కాజిగిరి సీటులో రాంచంద్రరావు, బీజేవైఎం భాను ప్రకాష్, కార్పొరేటర్ శ్రవణ్ ల మధ్య పోటీ ఉంది. మేడ్చల్ సీటు కోసం కొప్పల్లే మోహన్ రెడ్డి, విక్రమ్ రెడ్డి పోటీ పడుతున్నారు. ఉప్పల్ సీటు సీనియర్ నేత ఎన్‌వి‌వి‌ఎస్ ప్రభాకర్ ఫిక్స్ అయినట్లే. అయితే ఇదే సీటు కోసం మీసాల చంద్రయ్య, దేవేందర్ గౌడ్ తనయుడు వీరేందర్ గౌడ్ సైతం ట్రై చేస్తున్నారు. అటు దత్తాత్రేయ వారసుడు విజయలక్ష్మీకి ముషీరాబాద్ సీటు దాదాపు ఫిక్స్. గోషామహల్ సీటు ఎలాగో రాజసింగ్ కే దక్కుతుంది. సికింద్రాబాద్ సీటు కోసం బండా కార్తికారెడ్డి, సారంగపాణిల మధ్య పోటీ ఉంది. సనత్ నగర్ సీటు కోసం శ్యామ్ సుందర్ గౌడ్, ఆకుల విజయ,    ప్రదీప్ కుమార్ పోటీ పడుతున్నారు. రాజేంద్రనగర్ సీటుని స్వామి గౌడ్ ఆశిస్తున్నారు. ఇంకా పలువురు నేతలు రాజేంద్ర నగర్ సీటుపై ఆశలు పెట్టుకున్నారు. ఎల్బీ నగర్ సీటు కోసం పేరాల శంకర్, సామా రంగారెడ్డి…ఇబ్రహీంపట్నం సీటు కోసం దయానంద గౌడ్, అశోక్ గౌడ్ ల మధ్య పోటీ ఉంది. మొత్తానికి గ్రేటర్ లో బీజేపీ సీటు దక్కించుకోవడం కోసం చాలామంది నేతలు ట్రై చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news