బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్లో జరుగుతున్న విషయం తెలిసిందే. నేడు రెండో రోజు హెచ్ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రధాని మోడీ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ వాళ్లకు వందనం.. తెలంగాణ తల్లికి వందనం అంటూ వ్యాఖ్యానించారు. భాగ్య లక్షలాదిగా తరలివచ్చిన ప్రజలు, బీజేపీ కార్యకర్తలు, నేతలకు ధన్యవాదాలు తెలిపారు ప్రధాని మోడీ. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ నడుచుకుంటుందని ప్రధాని అన్నారు ప్రధాని మోడీ . తెలంగాణ గడ్డ ఎంతో స్ఫూర్తినిస్తుందన్నారు. ధైర్యసాహసాలు, కళలు, సాంస్కృతికి తెలంగాణ రాష్ట్రం సూర్తిదాయమని అన్నారు. బడుగు, బలహీన వర్గాల కోసం బీజేపీ పనిచేస్తోందన్నారు.
హైదరాబాద్ ప్రతిభకు పట్టం కడుతుందన్నారు ప్రధాని మోడీ . తెలంగాణ అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఎంతో సహకరిస్తుందన్నారు. కరోనా సమయంలోనూ తెలంగాణకు సహకరించామని, ఉచిత రేషన్, వ్యాక్సిన్ ఇచ్చినట్లు చెప్పారు ప్రధాని మోడీ. జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ ఇప్పటికే ఘన విజయం సాధించామన్నారు. తెలంగాణలో మెజార్టీ ప్రజలు బీజేపీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు ప్రధాని మోడీ . వచ్చే ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని.. తెలంగాణలో డబుల్ ఇంజిన్ సర్కారు ఏర్పాటవుతుందని ప్రధాని నరేంద్ర మోడీ ధీమా వ్యక్తం చేశారు. ప్రధాని మోడీ ప్రసంగం ప్రారంభించినప్పటి నుంచి లక్షలాదిగా హాజరైన అభిమానులు మోడీ మోడీ అంటూ నినాదాలు చేస్తూనే ఉన్నారు.
మోడీ ప్రసంగ సారాంశం
• తెలంగాణ యావత్తు ప్రజానీకం ఈ సభలోనే ఉన్నట్లుంది.
• తెలంగాణ ప్రజలందరికీ కేంద్రం పథకాలు అందుతున్నాయి.
• తెలంగాణ గడ్డకు శిరసు వంచి నమస్కరిస్తున్నా.
• తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజన్ సర్కారు కోరుకుంటున్నారు.
• తెలంగాణ ప్రజలకు బీజేపీపై విశ్వాసం పెరుగుతోంది. బీజేపీ ప్రభుత్వం కోరుతూ ప్రజలు నిర్ణయించుకున్నారు.
• 2019 నుంచి అంతకంతకూ మాకు మద్దతు పెరుగుతోంది.
• హైదరాబాద్ అన్నింటికీ శక్తినిస్తుంది.
• తెలంగాణ ఓ పుణ్యస్థలం. తెలంగాణ పరాక్రమానికి నిదర్శనం. తెలంగాణ శిల్పకళ మనకు గర్వకారణం. తెలంగాణ అభివృద్ధే మా ప్రథమ ప్రాధాన్యం.
• సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రంతో తెలంగాణ అభివృద్ధి
బీజేపీకి పెరిగిన ఆదరణ
• తెలంగాణ ప్రజలు గత లోక్ సభ ఎన్నికల్లో బీజేపీని ఆదరించారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీజేపీకి మంచి ఫలితాలిచ్చారు.
• తెలంగాణ ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు ఇచ్చాం.
• గత ఆరేళ్లలో లక్ష కోట్ల ధాన్యాన్ని కేంద్రం కొనుగోలు చేసింది.
• తెలంగాణలో కొత్త రైల్వే లైన్లు నిర్మించాం.
• రాష్ట్రంలో జాతీయ రహదరాలకు భారీగా నిధులు ఇచ్చాం.
దేశ అభ్యున్నతికి విశేష కృషి
• కరోనా కష్టకాలంలో ప్రజలకు మేలు చేశాం.
• దేశవ్యాప్తంగా మహిళా సాధికారత సాధిస్తున్నారు.
• ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది.
• బడుగు, బలహీన వర్గాల కోసం కేంద్ర ప్రభుత్వం పనిచేస్తోంది.
• దశాబ్దాల నుంచి వంచనకు గురైన వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నాం.
• ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం.
హైదరాబాద్.. అత్యున్నతం
• హైదరాబాద్ లో అత్యాధునికి పరిశోధనా కేంద్రం ఏర్పాటు చేశాం.
• హైదరాబాద్ లో సైన్స్ సిటీ ఏర్పాటుకు కేంద్రం సిద్ధంగా ఉంది.
• రామగుండం ఎరువుల ఫ్యాక్టరీని తిరిగి తెరిపించాం.
• తెలంగాణ 5 నీటి ప్రాజెక్టులకు కేంద్రం సహకరిస్తుంది.
• రూ.350 కోట్లతో హైదరాబాద్కు మరో రీజినల్ రింగ్ రోడ్డు మంజూరు చేశాం.
• బయో మెడికల్ సైన్సెస్ కంద్రాలు ఏర్పాటవుతున్నాయి.
• తెలంగాణలో కళ, కౌశలం పుష్కలంగా ఉన్నాయి.
• తెలంగాణలో మెగా టెక్స్ టైల్స్ పార్కును ఏర్పాటు చేస్తాం.