టీడీపీ నేత బాలకోటిరెడ్డి దాడిపై డీఎస్పీ క్లారిటీ

-

ప‌ల్నాడు జిల్లా రొంపిచ‌ర్ల మండ‌ల టీడీపీ అధ్య‌క్షుడు, మాజీ ఎంపీపీ వెన్నా బాలకోటిరెడ్డిపై మంగ‌ళ‌వారం జ‌రిగిన దాడికి సంబంధించి న‌ర‌స‌రావుపేట వివరాలు వెల్ల‌డించారు డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి. బాల కోటిరెడ్డిపై దాడికి పాల్ప‌డింది టీడీపీకి చెందిన వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి అని డీఎస్పీ తెలిపారు. బాల కోటిరెడ్డి కుమారుడి ఫిర్యాదు మేర‌కు వెంక‌టేశ్వ‌ర రెడ్డిపై కేసు న‌మోదు చేయ‌డంతో పాటు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని కూడా పేర్కొన్నారు డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి. టీడీపీలోని అంత‌ర్గ‌త విభేదాల కార‌ణంగానే ఈ దాడి జ‌రిగింద‌ని కూడా తెలిపారు డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి.

TDP focusing on winning horses for next elections

కొంత‌కాలం ముగిసిన పంచాయ‌తీ ఎన్నికల్లో బాల కోటిరెడ్డి, వెంక‌టేశ్వ‌ర‌రెడ్డిలు రెండు వ‌ర్గాలుగా విడిపోయార‌ని, ఈ క్ర‌మంలో బాల కోటిరెడ్డి ఎదుగుద‌ల‌ను స‌హించ‌లేకే వెంక‌టేశ్వ‌ర‌రెడ్డి బాధితుడిపై దాడికి దిగార‌ని తెలిపారు డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి. ఇప్ప‌టికే నిందితుడిని అదుపులోకి తీసుకున్నామ‌ని.. బుధ‌వారం కోర్టులో హాజ‌రుప‌ర‌చ‌నున్న‌ట్లు వెల్ల‌డించారు డీఎస్పీ విజ‌య‌భాస్క‌ర్ రెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news