దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న సినిమా ‘సీతారామం’. దుల్కర్ సల్మాన్ గురించి ప్రత్యేకంగా తెలుగు తెరకు పరిచయం అక్కర్లేదు. ఆయన నటనకు తెలుగులో కూడా అభిమానులున్నారు. ‘యుద్ధం రాసిన ప్రేమకథ’ అనే ట్యాగ్ లైన్ సినిమాపై ఆసక్తిని రేకెత్తిస్తోంది. స్వప్న సినిమా బ్యానర్ పై నిర్మితమైన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. దుల్కర్ సల్మాన్ .. మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాలో రష్మిక కీలకమైన పాత్రను పోషించింది. ఈ సినిమాను ఆగస్టు 5వ తేదీన విడుదల చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ఈ కథలో కొంతభాగం 1960లలో నడుస్తుందనే విషయం ట్రైలర్ ను బట్టి అర్థమవుతోంది. లవ్ .. రొమాన్స్ .. ఎమోషన్ .. సస్పెన్స్ కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. విశాల్ చంద్రశేఖర్ బాణీలు .. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఈ సినిమాకి హైలైట్ గా నిలవనున్నట్టు అనిపిస్తోంది. ప్రకాశ్ రాజ్ .. మురళీశర్మ .. వెన్నెల కిశోర్ .. సుమంత్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రల్లో కనిపిస్తున్నారు.