‘ఊహలు గుసగుసలాడే’ అన్నట్టు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడని చంద్రబాబుపై విజయసాయి రెడ్డి ఫైర్ అయ్యారు. హిట్లర్ నాజీ పార్టీ ప్రజల మెదళ్లలో విషం నింపడానికి పత్రికలు, రేడియో, సినిమాల ద్వారా అసత్యపు వార్తలను వెదజల్లేది. 90 ఏళ్ల తర్వాత చంద్రబాబు కూడా అవే కాలంచెల్లిన పద్ధతులతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, Tv5, మహాTvలపై ఆధారపడటం అతి పెద్ద విషాదం. ఇది ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగం బాబూ! అంటూ చురకలు అంటించారు విజయసాయిరెడ్డి.
పచ్చ కుల మీడియా ఆనంద పులకింతలు చూస్తుంటే చకోరపక్షి కథలు గుర్తు రావట్లేదూ? చకోరాలు మేఘాల కోసం చూస్తూ వర్షపు చినుకులు భూమికి చేరక ముందే గాలిలో మాత్రమే తాగుతాయట. అలాగే ఉంది చంద్రబాబు అనే చకోరం ‘మోదీ గారి పలకరింపు’ అనే దీనగాథ! అని పేర్కొన్నారు.
‘మిలేంగే’ అని అన్నారో లేదో చంద్రబాబు మళ్ళీ తనకు పాతరోజులు వచ్చినట్టే కలలు కంటున్నాడు. ఇద్దరు వ్యక్తులు నిమిషం మాట్లాడినా వెళ్లేటప్పుడు మిలేంగే (కలుద్దాం) అనడం సాధారణం. దాని అర్థం అప్పుడప్పుడు ఢిల్లీకి రండి అని కాదు. ‘ఊహలు గుసగుసలాడే’ అన్నట్టు కుల మీడియాతో డప్పు కొట్టిస్తున్నాడని నిప్పులు చెరిగారు.
హిట్లర్ నాజీ పార్టీ ప్రజల మెదళ్లలో విషం నింపడానికి పత్రికలు, రేడియో, సినిమాల ద్వారా అసత్యపు వార్తలను వెదజల్లేది. 90 ఏళ్ల తర్వాత చంద్రబాబు కూడా అవే కాలంచెల్లిన పద్ధతులతో ఈనాడు, ఆంధ్రజ్యోతి, Tv5, మహాTvలపై ఆధారపడటం అతి పెద్ద విషాదం. ఇది ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల యుగం బాబూ!
— Vijayasai Reddy V (@VSReddy_MP) August 8, 2022