సకల శాఖ మంత్రి సజ్జల – లోకేష్ సెటైర్లు

-

ఏపీ ప్రభుత్వ సలహా దారుడు సజ్జలపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌ సెటైర్లు పేల్చారు. సకల శాఖ మంత్రి సజ్జల అంటూ చురకలు అంటించారు లోకేష్‌. మహిళలపై ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ప్రభుత్వానికి పట్టడం లేదని మండిపడ్డారు. పైగా మహిళలు ఫిర్యాదు చేస్తేనే చర్యలు అంటున్నారు సకల శాఖ మంత్రి సజ్జల అని… శ్రీ సత్యసాయి జిల్లా హిందూపూర్ మండలంలోని ఓ గ్రామానికి చెందిన మహిళపై ముగ్గురు మృగాళ్లు అత్యాచారానికి పాల్పడ్డారన్నారు.


బాధిత మహిళ స్థానిక పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే అత్యాచారం కేసు నమోదు చెయ్యకుండా తగాదా కేసు పెట్టి చేతులు దులుపుకున్నారు పోలీసులు అని మండిపడ్డారు. స్థానిక వైసిపి నేతల ఒత్తిడితో పోలీసులు కేసు తప్పుదోవ పట్టించాలని ప్రయత్నించారు.మహిళపై అత్యాచారానికి పాల్పడిన సోమశేఖర్, అఖిల్, అక్కులప్ప, వారికి సహకరిస్తున్న స్థానిక వైసిపి నేతలను తక్షణమే అరెస్ట్ చేసి బాధిత మహిళకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేశారు లోకేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news