రాజకీయ వ్యూహంతోనే అమిత్ షా, జూనియర్ ఎన్టీఆర్ భేటీ అయ్యారని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు. రాజకీయ ప్రయోజనాలు లేకుండా అమిత్ షా, నరేంద్ర మోడీ ఎవరితోనూ సమావేశం కారని.. దేశ వ్యాప్తంగా బీజేపీ తరపున జూనియర్ ఎన్టీఆర్ ప్రచారం చేసే అవకాశం ఉందని వెల్లడించారు.
ప్రచారం చేయటానికి బీజేపీలో చేయాల్సిన అవసరం ఉండదని.. టీడీపీలో జూనియర్ ఎన్టీఆర్‌తో అధికార మార్పిడి చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి కొడాలి నాని.
మహారాష్ట్రలో జరిగిన పరిణామాలు టీడీపీలో వచ్చే అవకాశం ఉందన్నారు.
చంద్రబాబు ఏక్ నాథ్ షిండే అని.. ఎన్టీఆర్ నుంచి పార్టీని ఏక్ నాథ్ షిండే లానే లాక్కున్నాడని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడి హోదా, పార్టీ అధ్యక్షుడు పదవి ఒకేసారి ఊడతాయన్నారు. 73 ఏళ్ళ వయసులో ఎన్టీఆర్‌కు చంద్రబాబు ఏ గతి పట్టించాడో అదే పరిస్థితి ఇప్పుడు చంద్రబాబు కు అదే గతి పట్టనుందని హెచ్చరించారు మాజీ మంత్రి కొడాలి నాని.