టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది : మంత్రి జోగి రమేష్‌

-

ఏపీలో టీడీపీపై తిరుగుబాటు మొదలైందని, చంద్రబాబు రాష్ట్రంలో తిరిగే పరిస్థితి కనిపించడం లేదని ఏపీ గృహనిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్‌ విమర్శించారు. నేడు తాజాగా.. మంత్రి జోగి రమేష్‌ మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ మీద ప్రజల్లో తిరుగుబాటు మొదలైంది అనడానికి కుప్పమే నిదర్శనమన్నారు. తిరుగుబాటు కుప్పంలో బీసీల నుంచే ప్రారంభమైందని, చంద్రబాబు జెండాను, పార్టీని కూకటి వేర్లతో పెకిలించడానికి ప్రజలు సిద్ధమయ్యారన్నారు మంత్రి జోగి రమేష్‌. తమను బానిసలుగా చేసుకున్న చంద్రబాబు.. ఏ ముఖం పెట్టుకుని కుప్పం వస్తాడని ప్రజలు ప్రశ్నిస్తున్నారని, ప్రజలంతా మనసున్న మారాజు.. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని జేజేలు కొడుతున్నారన్నారు మంత్రి జోగి రమేష్‌.

Andhra Pradesh SEC restrains MLA Jogi Ramesh from speaking to media

ప్రజలు కూడా పార్టీలు,కులాలు,మతాలు చూడమని.. సీఎం వైఎస్‌ జగన్‌ను మాత్రమే చూస్తామని చెబుతున్నారని మంత్రి జోగి రమేష్‌ అన్నారు. చంద్రబాబు.. నీ నియోజకవర్గంలోనే అభివృద్ధి లేదు. ఇంక నువ్వు రాష్ట్రానికి ఏం చేస్తావ్‌?. తండ్రీకొడుకులని నమ్ముకుంటే నట్టేట ముగినిపోతారు మంత్రి జోగి రమేష్‌ వ్యాఖ్యానించారు. కేఏ పాల్‌కు, పవన్‌ కల్యాణ్‌కు తేడా ఏమీలేదని, ఇద్దరికీ ఏపీలో సీట్లు లేవన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 175 నియోజకవర్గాల్లో ఓటమి తప్పదు. ఎల్లో మీడియా ఎన్ని జాకీలు పెట్టినా చంద్రబాబు లేవలేరు అని స్పష్టం చేశారు మంత్రి జోగి రమేష్‌.

Read more RELATED
Recommended to you

Latest news