ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. రెగ్యులర్ పరిమిత ఓవర్ల కెప్టెన్ అయినా జోస్ బట్లర్ స్థానంలో ఆ జట్టు స్టార్ ఆల్-రౌండర్ అయినా మొయిన్ ఆలీని టీ20 లకు స్టాండ్ ఇన్ కెప్టెన్ గా ప్రకటించింది. ఇక పోతే ఏడు మ్యాచ్ల టి20 సిరీస్ కోసం 17 ఏళ్ల తర్వాత పాకిస్తాన్ కు ఇంగ్లాండ్ టీం వచ్చే నెల వెళ్లనున్న సంగతి తెలిసిందే. ఈ టూర్లో మొయిన్ అలీ ఇంగ్లాండ్ కు కెప్టెన్సీ వహించనున్నాడు.
జోస్ బట్లర్ క్యాప్ స్ప్రేయిన్ గాయంతో బాధపడుతూ సెలక్షన్ నుంచి వైదొలగడంతో అతని స్థానంలో మొయిన్ ఆలీని కెప్టెన్ గా ఆ దేశ బోర్డు నియమించింది. ఇకపోతే గాయం కారణంగా ఇటీవల హండ్రెడ్ లీగ్ నుంచి కూడా బట్లర్ తప్పుకున్న సంగతి తెలిసిందే.
అతనికి నాలుగు వారాల విరామం అవసరం కావడంతో ఇక పాకిస్తాన్ టి20 సిరీస్ కు దూరం కానున్నాడు. ఇకపోతే లీగ్ లో మంచేస్టర్ ఒరిజినల్స్ కు బట్లర్ కెప్టెన్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ సీజన్లో అతను ఐదు ఇన్నింగ్స్ లలో 203 పరుగులు చేశాడు. అతను సదరన్ బ్రేవ్ తో జరిగిన మ్యాచ్ లో బౌండరీ వద్ద ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు గాయపడ్డాడు.