Dongalunnaru Jagratha review: దొంగలున్నారు జాగ్రత్త… ఆకట్టుకుందా?

-

‘దొంగలున్నారు జాగ్రత్త’ సర్వైవల్‌ థ్రిల్లర్‌గా ఈ సినిమా ప్రచారంలో నిలిచింది. సురేష్‌ ప్రొడక్షన్స్‌ సంస్థ సమర్పిస్తుండడం… కాన్సెప్ట్‌ చిత్రాలు ఎంచుకుంటూ ప్రయాణం చేస్తున్న శ్రీసింహా నటించడం… సముద్రఖని, శ్రీకాంత్‌ అయ్యంగార్‌ తదితరులుండటంతో సినిమా చూడాలనే ఆసక్తిని పెంచింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? ఇంతకీ దొంగలెవరు?

కథేంటంటే: రాజు (శ్రీసింహా కోడూరి) ఓ దొంగ.  కార్లలో ఉండే విలువైన వస్తువుల్ని  దొంగతనం చేస్తుంటాడు. అలా ఒకరోజు దొంగతనం కోసం ఓ కారుని ఎంచుకుంటాడు. తీరా అందులోకి ఎక్కాక లాక్‌ అయిపోతుంది. బయటికి రాకుండా  అందులోనే ఇరుక్కుపోతాడు. అంతలో ఓ వాయిస్‌ అతనికి వినిపిస్తుంది. రాజు అలా కార్‌లో లాక్‌ అయిపోవడం వెనక ఓ వైద్యుడు ఉన్నాడని తెలుస్తుంది. ఇంతకీ ఎవరా  వైద్యుడు? రాజునే ఎందుకు టార్గెట్‌ చేశాడు? కారులోనుంచి అతను బయటపడ్డాడా లేదా? అనేది మిగతాకథ.

https://youtu.be/TmCzbisjjrE

ఎలా ఉందంటే: తెలుగు తెరకి ఓ కొత్త జోనర్‌ని పరిచయం చేసిన చిత్రమిది. సర్వైవల్‌ థ్రిల్లర్‌ అంటూ చిత్రబృందం ప్రచారం చేసింది. 4×4 అనే  విదేశీ చిత్రం దీనికి స్ఫూర్తి. పతాక సన్నివేశాలు మినహా దాదాపుగా కథంతా ఒక కారులోనే జరగడం ఈ సినిమా ప్రత్యేకత. అసలు కథలోకి వెళ్లడానికి సమయం పడుతుంది. ఆరంభ సన్నివేశాలు సాగదీతగా, అంతంత మాత్రంగా  అనిపిస్తాయి. దొంగ కారులో ఇరుక్కుపోయాక, అతనికి కారులో వాయిస్‌తో కనెక్ట్‌ అయిన వ్యక్తి పాత్ర మరింత ప్రభావం చూపించడం మొదలుపెట్టాక అసలు కథ జోరందుకున్నట్టు అనిపిస్తుంది.  ఇలాంటి నేర నేపథ్యం ఉన్న కథలకి మరింత ఉత్కంఠ, థ్రిల్లింగ్‌ అంశాలు కీలకం. భావోద్వేగాలతోనూ కట్టిపడేసే ఆస్కారం ఉన్న కథ. ఈ కాన్సెప్ట్‌ బాగానే ఉన్నా దాన్ని ఆసక్తికరంగా తెరపైకి తీసుకు రావడంలో దర్శకుడు విఫలమయ్యారు. దొంగ కారులో లాక్‌ చేయడం వెనక ఉన్న రహస్యం ఒక్కొక్కటిగా బయటకి రావడం ఆసక్తిని రేకెత్తించినా, ఆ తర్వాత సన్నివేశాలతో ఇదొక సాధారణ ప్రతీకార కథలా మారిపోతుంది. దొంగతనాల తర్వాత వాటి తాలూకు ప్రభావం నేపథ్యాన్ని ఆవిష్కరిస్తూ చెప్పిన సందేశం సినిమాకి ప్రధానబలం. పతాక సన్నివేశాలు ఆకట్టుకుంటాయి. నిడివి తక్కువ అయినా కథ, కథనాలు ప్రేక్షకులపై పెద్దగా ప్రభావం చూపించవు.

ఎవరెలా చేశారంటే: శ్రీసింహా కోడూరి నటన చిత్రానికి ప్రధానబలం. కథంతా తన చుట్టూనే తిరుగుతుంది. కారులోనే కనిపిస్తూ, ప్రతీ సన్నివేశంలోనూ క్లోజప్‌లో కనిపించాల్సి ఉంటుంది. ఇలాంటి పాత్రల్ని పోషించడం కత్తిమీద సాము. ద్వితీయార్ధంలో ఆయన నటన మరింతగా మెప్పిస్తుంది.  సముద్రఖని, శ్రీకాంత్‌, ప్రీతి అస్రాని కీలకమైన పాత్రల్లో కనిపిస్తారు. శుభలేఖ సుధాకర్‌ వాయిస్‌ ఓవర్‌ బలమైన ప్రభావం చూపించింది. సాంకేతిక విభాగాల్లో సంగీతం గురించి మొదట చెప్పుకోవాలి. కాలభైరవ నేపథ్య సంగీతంతో మరోసారి తనదైన ముద్రవేశారు. ఛాయాగ్రాహకుడు యశ్వంత్‌.సి కెమెరా పనితనం మెప్పిస్తుంది. పరిమితుల మధ్యే తనదైన పనితీరుతో ప్రభావం చూపించారు. దర్శకుడు పనితనం కొన్ని సన్నివేశాల్లో మాత్రమే కనిపిస్తుంది. నిర్మాణం సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉంది.

ప్లస్ మైనస్ పాయింట్స్:  ఈ సినిమాలో హీరోగా నటించిన సింహా కోడూరి తన లుక్స్ అండ్ ఫిజిక్ పరంగా తన పాత్ర మేరకు బాగా మెయింటైన్ చేశాడు. అలాగే తన రియలిస్టిక్ యాక్టింగ్‌తో ఆకట్టుకుంటూ సినిమాకే హైలెట్‌గా నిలిచాడు. అలాగే, కీలక పాత్రలో నటించిన సముద్రఖని కూడా చాలా బాగా నటించాడు. హీరోయిన్ గా చేసిన ప్రీతి అస్రాని కూడా బాగా నటించింది. ఆమె హావ భావాలు కూడా బాగానే అలరించాయి. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు నటించారు.  దర్శకుడు సతీష్ త్రిపుర మంచి స్టోరీ లైన్ తీసుకున్నా.. దాన్ని ఇంట్రెస్టింగ్ ప్లేతో ఆసక్తికరంగా సినిమాని మలచలేక పోయారు. కొన్ని సన్నివేశాలు బాగా స్లోగా సాగడం, అలాగే మెయిన్ కాన్ ఫ్లిక్ట్ ని క్లారిటీగా ఎలివేట్ చేయకుండా పూర్తి సస్పెన్స్ పాయింటాఫ్ వ్యూలో స్క్రీన్ ప్లేని సాగతీయడంతో.. మెయిన్ క్యారెక్టర్స్ సరిగ్గా కనెక్ట్ కావు. దీనికి తోడు రాజు క్యారెక్టర్ ట్రాక్ కూడా చాలా సింపుల్ గా ఉండటం బాగాలేదు. మొత్తానికి ఈ రెగ్యులర్ ఎమోషనల్ వెరీ వెరీ స్లో క్రైమ్ స్టోరీ ఆకట్టుకో లేకపోయింది. దర్శకుడు సినిమాని ఇంట్రెస్టింగ్ గా తెరకెక్కించలేకపోయాడు.

చివరిగా:  ‘దొంగలున్నారు జాగ్రత్త’ అంటూ వచ్చిన ఈ క్రైమ్ ఎమోషనల్ సస్పెన్స్ డ్రామాలో మెయిన్ స్టోరీ లైన్ అండ్ కొన్ని సీన్స్ ఆకట్టుకున్నాయి. కానీ, ఈ సినిమా మాత్రం మెప్పించలేకపోయింది. అయితే, సింహా నటన అండ్ కొన్ని భావోద్వేగ సన్నివేశాలు బాగున్నాయి. కానీ, కథ కథనాలు బాగా స్లోగా సాగడం, అలాగే ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ పెద్దగా లేకపోవడం, ఇక సెకండ్ హాఫ్ కూడా బోర్ గా సాగడం, అనవసరమైన సన్నివేశాలతో సినిమాని బాగా ల్యాగ్ చేయడం వంటి అంశాలు సినిమాకి మైనస్ పాయింట్స్‌గా నిలిచాయి. ఓవరాల్ గా ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చదు.

రేటింగ్: 2/5

Read more RELATED
Recommended to you

Latest news