175 లాజిక్.. టార్గెట్ ఇది కాదు..!

-

ఏపీ రాజకీయాల్లో ఇటీవల ఎక్కువ వినిపిస్తున్న మాట 175కి 175 సీట్లు గెలవాలి. ఇది జగన్ పదే పదే చెబుతున్న మాట. ఏ సభలోనైనా..పార్టీ సమావేశంలోనైనా జగన్ 175 అనే మాట్లాడుతున్నారు. అసలు చంద్రబాబు కంచుకోట అయిన కుప్పంలో పంచాయితీ, పరిషత్ ఎన్నికల్లో సత్తా చాటమని, అలాగే కుప్పం మున్సిపాలిటీని గెలుచుకున్నామని..కాబట్టి కుప్పం నుంచే మొదలు పెట్టి 175కు 175 సీట్లు ఎందుకు గెలుచుకోలేమని చెప్పి జగన్..తమ పార్టీ నాయకులని ప్రశ్నించారు.

అక్కడ నుంచి జగన్ నోట 175 మాట వస్తూనే ఉంది. మొదట్లో ఈ టార్గెట్ గురించి వైసీపీ ఎమ్మెల్యేలు గాని, మంత్రులు గాని పదే పదే మాట్లాడటలేదు. కానీ ఇప్పుడు వాళ్ళు కూడా 175 గెలవడమే తమ లక్ష్యమని మాట్లాడుతున్నారు. ఒక్క సీటు కూడా వదలకుండా గెలవాలని జగన్ సూచించారని, అందులో తప్పేమీ లేదని మంత్రి బొత్స సత్యనారాయణ అంటున్నారు. అయితే చెప్పడానికి ఈజీగా 175 సీట్లు అని చెప్పేస్తున్నారు.

కానీ 175 సీట్లు గెలవడం సులువా? అంటే ఏ మాత్రం సులువు కాదని చెప్పొచ్చు. అసలే వైసీపీ ఎమ్మెల్యేలపై వ్యతిరేకత ఉంది..ప్రభుత్వంపై అసంతృప్తి ఉంది..టీడీపీ బలపడుతుంది..అటు జనసేనతో కలిస్తే వైసీపీకి గెలుపే కష్టమనే పరిస్తితి. అలాంటప్పుడు 175 సాధ్యం కాదని సంగతి వైసీపీ నేతలకు బాగా తెలుసు…అది జగన్‌కు కూడా తెలియకుండా ఉండదు.

కాకపోతే పదే పదే 175 అని చెప్పడం వెనుక ఓ లాజిక్ ఉందని తెలుస్తోంది. ఇలా చెప్పడం వల్ల కనీసం తక్కువలో తక్కువ 100 సీట్లు అయిన వస్తాయని భావిస్తున్నారు. ప్రజలు కూడా 175 అంటే..అబ్బో వైసీపీకి ఇంకా బలం ఉందని భావించి..మళ్ళీ వైసీపీ వైపే మొగ్గు చూపుతారనేది వైసీపీ ప్లాన్‌గా ఉందని తెలుస్తోంది. అంటే 175 చెబితే అందులో కనీసం 100 సీట్లు పైన అయిన గెలవలేమా? అనేది లాజిక్‌గా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news