బాలీవుడ్​లోకి తాగుబోతు రమేశ్ ఎంట్రీ.. ఏకంగా ఆ స్టార్ హీరో సినిమాలో ఛాన్స్​..

-

పెద్దగా పంచ్​ డైలాగులు లేకుండానే.. కేవలం హావభావాలతోనే పొట్టచెక్కలయ్యేలా నవ్వించగలడు. ఓ తాగబోతు పాత్ర నుంచి ఇంత హాస్యం పండిచొచ్చా అనేలా తన నటనతో ఆకట్టుకున్నాడు. అతడే తాగబోతు రమేశ్. అటు సినిమాలు చేస్తూనే ఇటు జబర్దస్త్​లో స్కిట్లు చేస్తూ ప్రేక్షకులకు డబుల్​ ఫన్​ని అందిస్తున్నాడు. అయితే ఈ మధ్య అవకాశాలు తగ్గిపోయాయని వార్తలు వచ్చాయి. అడపదడపా మాత్రమే సినిమాల్లో కనిపిస్తున్నారు తాగుబోతు రమేశ్.

అయితే తాగుబోతు రమేశ్ తాజాగా బంపర్ ఆఫర్ కొట్టేశాడు. ఏకంగా బాలీవుడ్​లో ఎంట్రీ ఇవ్వనున్నారు. అదికూడా బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టనుండటం విశేషం. టాలీవుడ్ కమెడియన్ తాగుబోతు రమేష్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఎన్నో సినిమాలలో తాగుబోతు క్యారెక్టర్స్​తో ప్రేక్షకులను మెప్పించి.. చివరికి క్యారెక్టర్స్​లోని తాగుబోతునే ఇంటిపేరుగా మార్చుకున్నాడు. అయితే.. ఇప్పటివరకూ తెలుగు సినిమాలలోనే అలరించిన రమేశ్​.. త్వరలోనే సల్మాన్ ఖాన్ సినిమాతో హిందీ సినిమాలో కామెడీ పండించనున్నట్లు సమాచారం.

 

 

View this post on Instagram

 

A post shared by Thagubothu Ramesh (@thagubothramesh)

ఈ క్రమంలో ఏకంగా బాలీవుడ్​లో.. అదీ సల్మాన్ ఖాన్ సినిమాలో అవకాశం అందుకున్నాడని తెలిసి ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రమేశ్​ ఈ విషయాన్ని సల్మాన్​తో కలిసి దిగిన ఫొటోను సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా విషయాన్నీ ప్రకటించాడు. అయితే.. ఫొటోలో గమనిస్తే తాగుబోతు రమేశ్​.. సల్మాన్​తో సెట్​లో ఉన్నట్లే తెలుస్తోందని కామెంట్స్ వినిపిస్తున్నాయి.

 

View this post on Instagram

 

A post shared by Thagubothu Ramesh (@thagubothramesh)

Read more RELATED
Recommended to you

Latest news