జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ పర్యటన ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ నేపథ్యంలోనే.. పవన్ కళ్యాణ్ ఆసక్తి కర ట్వీట్ చేశారు. ఉడతా ఉడతా ఊచ్.. ఎక్కడ కెళ్తోవోచ్… రుషికొండ మీద జాంపండు కోసుకొస్తావా అంటూ తన స్టైల్ లో ట్వీట్ చేశారు. మా వైసిపికి ఇస్తావా… మా థానోస్ గూట్లో పెడతావా అని సెటైర్లు పేల్చారు.
అలాగే..విశాఖపట్నం కేంద్రంగా రాష్ట్ర ప్రభుత్వం వ్యవస్థలను దుర్వినియోగం చేస్తూ ఎటువంటి అప్రజాస్వామిక విధానాలు అవలంభిస్తోందో ప్రతి ఒక్కరూ చూస్తున్నారని.. ఈ చర్యలను ఖండిస్తూ పార్టీలకు అతీతంగా సంఘీభావం తెలియచేశారన్నారు.
తెలుగుదేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రభుత్వం పోలీసు శాఖను దుర్వినియోగం చేయడాన్ని తప్పుబట్టి, పార్టీ నేతలపై అక్రమ కేసులు నమోదు చేసి, అరెస్టులను ఖండించినందుకు కృతజ్ఞతలు.భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ సోము వీర్రాజు గారు ఫోన్లో సంభాషించారు. ప్రభుత్వ చర్యలను తప్పుబట్టారని వెల్లడించారు.