చేపలు పట్టడంలో తప్పక పాటించాల్సిన మెళకువలు..!!

-

మన దేశ సంపదలో ఒకటి మత్స్య సంపద..పంటలను వెయ్యడం కన్నా చేపల పెంపకంలో ఎక్కువ లాభాలు రావడంతో రైతులు ఎక్కువ మంది చేపల పెంపకంపై మక్కువ చూపిస్తున్నారు.చేపలు పట్టడంలో కొన్ని మెలుకువలు తప్పనిసరిగా పాటించాలి.. అవేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

పట్టుబడి అయిన చేపలను మంచినీటితో శుభ్రపరచక పోవడం, నేలపై ఇష్టం వచ్చినట్లు విసిరివేయడం, గాయపరచడం, గ్రేడింగ్ చేయకపోవడం, సరిపడా బస్లో పెట్టకపోవడం వల్ల కూడా చేపల నాణ్యత తగ్గిపోతుంది. ఫలితంగా గిట్టుబాటు ధర లభించక నష్టాలబారిన పదాల్సి వస్తుంది..చేపలు పట్టుబడికి ముందు AMA ఒక రూపొందించుకోవాలి. అన్నింటిని సమకూర్చుకున్న తర్వాతనే పట్టుబడిని ప్రారంభించాలి. చేపలు పట్టే ఒక రోజు ముందు కావాల్సిన వలలు, సరిపడా మనుషులు, తగినంత ఐస్, ప్లాస్టిక్ ట్రేలు, థర్మాకోల్ బాక్సులు, టార్పాలిన్, షీట్స్, టెంట్ వగైరా వంటి వాటిని సమకూర్చుకోవాలి.

ముందుగా చేపలను పట్టిన తర్వాత మంచి నీటితో కడగాలి..చేపలు పట్టే చెరువు దగ్గరకు చేపలను రవాణా చేసే పెద్ద వాహనాలు దారి సరిగాలేక రానట్లయితే, పట్టుబడి అయిన చేపలను ట్రాక్టర్ల సహాయంతో లేదా చిన్న చిన్న ట్రాలీ ఆటోలతో పెద్ద వాహనాల దగ్గరకు చేర్చాలి. ఈ రవాణాలో కూడా చేపలను తక్కువ పరిమాణం గల ఐస్ చల్లి తీసుకెళ్ళడం అన్ని విధాల మంచిది.

చేపలను సైజుల వారీగా గ్రేడింగ్ చేసుకొని త్వరత్వరగా తూకం చేసి, ట్రేలలో సరిపడే ఐస్ వేసి ప్యాకింగ్ చేయాలి. గాయపడిన చేపలను మంచిగా వున్న చేపల నుంచి వేరు చేసి వీటిని విడిగా ప్యాక్ చేయడం మంచిది.సుమారు 20 గంటల్లోగా మార్కెటింగ్ చేసే చేపలను ప్లాస్టిక్ ట్రేలల్లో మరియు 30 గంటల్లో లేదా ఆపైన మార్కెటింగ్ చేసే చేపలను థర్మాకోల్ బాక్సుల్లో ప్యాక్ చేయాలి.చేపల ప్యాకింగ్లో పొడి చేసిన ఐస్ను వాడటం మంచిది. ట్రేలలో చేపలను, ఐస్ను 1:1 నిష్పత్తిలో వేయాలి. అంటే ఒక ట్రేలో 50 కిలోల చేపలకు 50 కిలోల బస్ను వేయాలి.ఐస్ మరియు చేపలను బాక్స్/ట్రేలలో ఒక వరసలో వేయాలి…ముందుగా చేపలు,పై వరుసలో ఐస్, దానిపై బస్ వెయ్యాలి..బాక్స్ నిండిన తర్వాత ఫ్యాక్ చేయాలి..ఏది ఏమైనా వీటిని నీడలో మాత్రమే ఫ్యాక్ చెయ్యాలి..

Read more RELATED
Recommended to you

Latest news