భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు కొత్తగా మంజూరైన నర్సింగ్ కళాశాలలో బుధవారం అడ్మిషన్లు ప్రారంభమయ్యాయి. కాలేజీలో 60మందికి అవకాశం ఉండగా మొదటి కౌన్సిలింగ్లో 58మంది ఆప్షన్లు పెట్టుకున్నారు. తొలిరోజు 32మంది ప్రిన్సిపాల్ ద్వారా అడ్మిషన్లు తీసుకున్నారు. వైద్య విద్యకు ప్రభుత్వం అత్యధిక ప్రోత్సాహం కల్పించడంతో మన్యం జిల్లాకు మెడికల్ కాలేజీతో పాటు నర్సింగ్ కాలేజీ మంజూరు చేయడంతో సర్వత్రా హర్షం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా నుంచి ఇప్పటికే ఐదుగురు విద్యార్థులు కాలేజీలో సీటు దక్కించుకున్నారు. కాలేజీలో విద్యార్థులకు హాస్టల్ వసతి కల్పించేందుకు మరో భవన సముదాయాన్ని ఏర్పాటు చేస్తున్నారు. జనవరి నుంచి తరగతులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
సెకండ్‌ఫేజ్‌లో వెబ్ ఆప్షన్ల ద్వారా అడ్మిషన్లు భర్తీ చేసుకునేందుకు కాళోజీ హెల్త్యూనివర్సిటీ నుంచి అనుమతించింది. ఇప్పటికే నర్సింగ్ఫస్ట్ఫేజ్కౌన్సెలింగ్పూర్తయింది. సెకండ్ఫేజ్కౌన్సెలింగ్ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది. థర్డ్‌ఫేజ్ కౌన్సెలింగ్కంప్లీట్అయ్యాక జనవరిలో క్లాస్‌లు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్ ఇయర్లో 60 సీట్లు జిల్లాలోని పాల్వంచలో గతేడాది నర్సింగ్ కాలేజీ మంజూరైంది. పాల్వంచలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఇదే టైంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరయింది. దానికి బిల్డింగ్లేకపోవడంతో టెంపరరీగా ఈ బిల్డింగ్‌ను మెడికల్‌కాలేజీకి కేటాయించారు. దీంతో నర్సింగ్ కాలేజీ మంజూరుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ అకడమిక్ ఇయర్లో ఎలాగైనా నర్సింగ్ కాలేజీని ప్రారంభించాలని అధికారులు చర్యలు చేపట్టారు.