నేటి నుంచి బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు

-

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. ఢిల్లీలోని ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్ లో రెండు రోజుల పాటు (16, 17 తేదీల్లో) ఈ సమావేశాలు జరుగుతాయి. నేడు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు బీజేపీ జాతీయ కార్యాలయంలో పదాధికారుల సమావేశం జరుగుతుంది. ఈ మీటింగ్ లో పదాధికారులు, అన్ని రాష్ట్రాల అధ్యక్షులు, సంఘటన్ మహామంత్రులు పాల్గొంటారు. సాయంత్రం 4 గంటల నుంచి ఎన్డీఎంసీ కన్వెన్షన్ సెంటర్లో బీజేపీ నేషనల్ ఎగ్జిక్యూటివ్ సమావేశాలు ప్రారంభం అవుతాయి. 17న సాయంత్రం 4 గంటలకు జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగుస్తాయి. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు 35మంది కేంద్ర మంత్రులు, 12 మంది బీజేపీ ముఖ్యమంత్రులు, ఐదుగురు ఉప ముఖ్యమంత్రులు, 37 రాష్ట్రాలు – కేంద్ర పాలిత ప్రాంతాల అధ్యక్షులు, మరో 27 మంది (సంఘటన్ మంత్రులు, మహా మంత్రులు, క్షేత్రీయ సంఘటన్ మంత్రులు) పాల్గొంటారు.

19 మంది మాజీ ముఖ్యమంత్రులు, 12 మంది మాజీ ఉప ముఖ్యమంత్రులు, 17మంది ఫ్లోర్ లీడర్లు, 168 మంది లోక్‌సభ, రాజ్యసభ చీఫ్ హెడ్ లు, 182 ఇతర సభ్యులు పాల్గొంటారు. మొత్తం 350 మంది జాతీయ కార్యవర్గ సభ్యులు హాజరవుతారు. రెండు రోజుల సమావేశాల్లో 6 అంశాలపై ప్రజెంటేషన్ జరుగుతంది. సేవా, సంఘటన్, సమర్పణ్, విశ్వగురు భారత్, సుశాసన్ సర్వ ప్రథమ్ (గవర్నెన్స్ ఫస్ట్), సమావేశ్, సశక్త్ భారత్, సంస్కృతి సంవాహ్, ప్రతి పక్షం హోదాలో ఆయా రాష్ట్రాల్లో చేపట్టిన కార్యక్రమాలు, ఎజెండాలో అంశాలు వంటివి చర్చకు వస్తాయి.

Read more RELATED
Recommended to you

Latest news