మరో డేరింగ్ డాషింగ్ కథ తో, యంగ్ డైరెక్టర్ కాంబినేషన్లో బాలయ్య బాబు.!

-

నందమూరి బాలకృష్ణ అంటే మాస్ కా బాప్,  అభిమానులకు తనని మొన్నటి దాకా థియేటర్స్ లోనే చూసే అవకాశం వుండేది. కాని తాను ప్రస్తుతం టాక్ షో, యాడ్స్ లో కూడా కనిపిస్తూ అలరిస్తున్నాడు. ఇక తన అభిమానులు కాని వారు కూడా ఆహా ఓటిటి లో అన్ స్టాపబుల్ షో  చూసి అందరూ జై బాలయ్య అంటూ గోల గోల చేస్తున్నారు. సీజన్ 1,2 ఓటిటి లలో రికార్డ్ మోత మోగిస్తున్నాయి. ఇక అఖండ సినిమా తో కరోనా కాలంలో కూడా రికార్డ్ బ్రేక్ వసూళ్ళు సాధించాడు.

తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య బాబు నటించిన తాజా చిత్రం వీర సింహారెడ్డి. ఈ సినిమా తాజాగా జనవరి 12న విడుదలైన విషయం మనందరికీ తెలిసిందే. ఈ సినిమా విడుదల అయి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఇప్పటికే 80 కోట్ల రూపాయల వసూళ్లు సాధించిన ఈ సినిమా వంద కోట్లు టార్గెట్ దిశగా దూసుకుపోతుంది. దీనితో బాలయ్య బాబు ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇక బాలయ్య బాబు నెక్స్ట్ సినిమా గురించి అప్పుడే టాక్ నడుస్తోంది. తాజాగా బాలయ్య కొద్దిగా చేంజ్ కోసం యంగ్ డైరెక్టర్స్ కథలు వింటున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం ఒక యంగ్ డైరెక్టర్ కథను ఫైనల్ చేసి నట్లుగా సమాచారం వినిపిస్తోంది. తాజాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ బాలకృష్ణకు ఒక సూపర్ కథను బాలయ్య కు వినిపించాడట. అసలే డేరింగ్ డాషింగ్ సబ్జెక్ట్ అంటే వెనక్కి తిరగని బాలయ్యను  ఈ కథ ఇంప్రెస్ చేసిందట. దానితో వెంటనే ఓకే చేసి ఏర్పాట్లు చేసుకోమని చెప్పారట. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది.

 

Read more RELATED
Recommended to you

Latest news