ఇంటిని చూసి ఇలాలని చూడమని అంటూ ఉంటారు పెద్దలు. ఇల్లాలు సక్రమంగా ఉంటే కచ్చితంగా ఇల్లు ఎంతో బాగుంటుంది. అలానే తల్లి బాగా ఉంటే పిల్లలు కూడా బాగా ఉంటారు. మంచి విషయాలు నేర్చుకోగలుగుతారు కాబట్టి కచ్చితంగా భార్యలో మంచి గుణాలు ఉండాలి. ఆచార్య చాణక్య భార్య లో ఎలాంటి గుణాలు ఉండాలో చెప్పారు.
మరి ఆచార్య చాణక్య చాణక్య నీతి ద్వారా చెప్పిన ముఖ్య విషయాలను ఇప్పుడు చూద్దాం. ఈ గుణాలు ఉంటేనే మంచి భార్య అంటారు అని చాణక్య అన్నారు మరి ఎటువంటి గుణాలు ఉండాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం.
ఎప్పుడు కూడా భర్త పట్ల అనురాగంతో భార్య ఉండాలి అలానే పవిత్రంగా పతివ్రతగా కౌశలంగా ఉండాలి.
అలానే భర్తతో అబద్ధం చెప్పకూడదు. ఎప్పుడు భార్య నిజమే చెప్పాలి. అటువంటి భార్య ఉంటే భర్త అదృష్టం అని చాణక్య అంటున్నారు.
భార్య ఎప్పుడు కూడా అబద్ధాలు ఆడకూడదు అబద్ధాలు చెప్పడం వలన ఎటువంటి లాభం లేదు నిజానికి అబద్ధాల వల్ల నష్టాలే కలుగుతాయి.
అలానే చాణక్య తనువు మనసుతో వాక్కుతో భర్త పైన అనురక్తిని పెంచుకొని భర్తకి ఎలా అయితే అనుకూలంగా ఉంటుందో అలా నడిచేదే నిజమైన భార్య అని చాణక్య అన్నారు. అనుమానాలు పుట్టించే మాటలు ఎప్పుడు భార్య చెప్పకూడదని చాణక్య అంటున్నారు కాబట్టి ఇటువంటి లక్షణాలని అలవాటు చేసుకోవడం మంచిది. నిజానికి ఇలాంటి లక్షణాలు ఉంటే వారి కుటుంబం ఎంతో బాగుంటుంది అలానే భార్యాభర్తలు కలకాలం కలిసి ఆనందంగా జీవించగలరు.