ముఖేష్ అంబానీ, అమితాబ్ బచ్చన్ బంగ్లాలను పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపు కాల్

-

ముంబైలో ఓ పాక్ ఉగ్రవాది ఎంటర్ అయ్యాడని ఎన్ఐఏ పోలీసు వర్గాలను అప్రమత్తం చేసిన విషయం తెలిసిందే. ఉగ్రవాదిని పట్టుకునేందుకు జాతీయ సంస్థలు, పోలీసులు తీవ్రగాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలోనే బాలీవుడ్‌ అగ్రనటులు అమితాబ్‌ బచ్చన్, ధర్మేంద్ర ఇళ్లకు బాంబు బెదిరింపులు రావడంతోపాటు ముంబైలో ఒక్కసారిగా కలకలం రేపింది. మంగళవారం మధ్యాహ్నం నాగ్‌పూర్ పోలీసులకు కాల్ వచ్చింది. దీంతో ముంబై పోలీసులు అప్రమత్తమై విచారణ చేపట్టారు. ఇది ఫేక్‌ కాల్‌ కావచ్చునని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, అతని కుటుంబ సభ్యులకు భారతదేశం, విదేశాలలో అత్యున్నత Z+ భద్రత కల్పించాలని మంగళవారం సుప్రీంకోర్టు హోం మంత్రిత్వ శాఖను ఆదేశించింది. భద్రతకు అయ్యే ఖర్చును అంబానీలు భరిస్తారు.

Caller threatens to blow up houses of Mukesh Ambani, Amitabh Bachchan,  Dharmendra: Report

గతంలో ముకేష్‌ అంబానీ, ఆయన కుటుంబసభ్యులకు బెదిరింపులు వచ్చిన సంగతి తెలిసిందే. అఫ్జల్ అనే వ్యక్తి ఈ ఉదయం ముంబైలోని గిర్గావ్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్‌లోని ల్యాండ్‌లైన్ నంబర్‌కు మూణ్నాలుగు సార్లు బెదిరింపు కాల్‌లు చేసినట్లు అధికారులు తెలిపారు. కాల్ చేసిన ఫోన్ నం బర్‌ సాయంతో నిందితుడిని గుర్తిం చినట్లు వెల్లడించారు. ఫోన్‌ చేసిన వ్యక్తికి మతిస్థిమితం లేనట్లు ప్రాథమిక విచారణలో తేలింది. గతేడాది ముకేశ్ అంబానీ నివాసం ఆంటిలియా సమీపం లో పేలుడు పదార్థాలతో కూడిన ఓ స్కార్పియో కారును నిలిపి ఉంచడం సంచలనం సృ ష్టించిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగిన వారం రోజులకే స్కార్పియో యజమాని మన్‌సుఖ్‌ హీరేన్‌ అనుమానాస్పద రీతిలో చనిపోయారు. ఈ కేసులను తొలుత ఇన్‌స్పెక్టర్‌ సచిన్‌ వాజే దర్యా ప్తు చేపట్టగా.. తర్వాత ఆయనే ప్రధాన సూత్రధారిగా తేలడం గమనార్హం .

Read more RELATED
Recommended to you

Latest news