దిల్లీ లిక్కర్ స్కామ్.. ఆడిటర్ బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై నేడు కోర్టు తీర్పు

-

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ లిక్కర్ స్కామ్ కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో రోజుకో కొత్త పరిణామం చోటుచేసుకుంటోంది. ఇప్పటికే ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులు అరెస్టు అయ్యారు. అందులో భాగంగానే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబును ఇటీవల సీబీఐ అరెస్టు చేసిన విషయం విదితమే. అయితే తాజాగా గోరంట్ల బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై నిర్ణయం ఇవాళ్టికి వాయిదా వేసింది.

సీబీఐ కోర్టు బుచ్చిబాబు బెయిల్ పిటిషన్​పై నిర్ణయాన్ని ఇవాళ్టికి వాయిదా వేసింది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు తీర్పు వెల్లడించనుంది. ఈ కేసులో బుచ్చిబాబుకు జ్యుడీషియల్ కస్టడీ పొడిగించిన విషయం తెలిసిందే. సీబీఐ అరెస్టు చేసిన బుచ్చిబాబుకు 14 రోజుల కస్టడీని పొడిగించారు. కేసు దర్యాప్తు పురోగతిలో ఉన్నందున కస్టడీ పొడిగించాలని సీబీఐ.. కోర్టును కోరింది. సీబీఐ విజ్ఞప్తి మేరకు ప్రత్యేక కోర్టు కస్టడీ పొడిగించింది. తదుపరి విచారణను ఈ నెల 9 వ తేదీకి వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news