తిరుమలకు నడకదారిలో వచ్చే భక్తులకు టీటీడీ శుభవార్త చెప్పింది. అలిపిరి, శ్రీవారి మెట్టు నడక మార్గాల్లో వచ్చే భక్తులకు త్వరలో దివ్య దర్శనం టోకెన్లు జారీ చేయనున్నట్లు టీటీడీ ఈవో ఏవి ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలకు నడక మార్గాల్లో వచ్చే భక్తుల్లో 60% మంది వద్ద దర్శన టికెట్లు ఉండటం లేదని గుర్తించామని తెలిపారు.
అందుకే ప్రత్యేకంగా సాఫ్ట్వేర్ ను రూపొందిస్తున్నామని, అది పూర్తి కాగానే టోకెన్ జారీని ప్రారంభిస్తామని చెప్పారు. దివ్యదర్శనం టోకెన్ల జారీపై సర్వే నిర్వహించి విధివిధానాలు ఖరారు చేస్తామన్నారు. శ్రీవారి దర్శనానికి విచ్చేసే భక్తులకు ఫేస్ రికగ్నిషన్ టెక్నాలజీతో మరింత పారదర్శకంగా వేగంగా సేవలు అందిస్తున్నట్లు ఈవో ధర్మారెడ్డి తెలిపారు. తిరుమలలో గదులు అందుబాటును బట్టి వృద్ధులు, దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ లోనే గదులు కేటాయిస్తున్నాము అన్నారు ఈవో.