ఏపీ బడ్జెట్ సమావేశాలు మొదలైన విషయం తెలిసిందే. బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ స్పీచ్ ఇచ్చారు. అయితే వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన పేపర్లనే ఆయన యధావిధిగా చదివేశారు. ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం గవర్నర్ చేత అబద్దాలు చెప్పిస్తుందని టిడిపి ఎమ్మెల్యేలు ఫైర్ అయ్యారు. గవర్నర్ స్పీచ్ ఇస్తుండగానే..సార్ మీ చేత అబద్దాలు చెప్పిస్తున్నారని టిడిపి ఎమ్మెల్యేలు గవర్నర్‌కు సూచించారు.
దిశా యాక్ట్‌ను ఇంప్లిమెంట్ చేస్తున్నామని గవర్నర్ చెప్పగా… దిశా యాక్ట్ పెద్ద ఫేక్ అని, దీనిని కేంద్ర ప్రభుత్వం తిరస్కరించింది అని టీడీపీ పేర్కొంది. అలాగే రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి గవర్నర్ మాట్లాడుతున్న సమయంలో రైతులకు ఒరిగిందేమీ లేదంటూ తెలుగుదేశం ఎమ్మెల్యేలు కేకలు వేశారు. అయితే గవర్నర్ ప్రసంగంలో వృద్ధి రేటుపై టీడీపీ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా, గవర్నర్ ప్రసంగానికి అడ్డుపడ్డారు. దీంతో కాసేపు సభలో గందరగోళం నెలకొంది. సుప్రీం కోర్టు న్యాయమూర్తిగా పనిచేసి వచ్చారన్న విషయాన్ని విస్మరించి గవర్నర్ చేత అసత్యాలు చెప్పిస్తున్నారంటూ టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.
అయితే గవర్నర్ ప్రసంగం పూర్తిగా వైసీపీ స్క్రిప్ట్ మాదిరిగానే ఉందని విమర్శలు వచ్చాయి. కల్పిత లెక్కలను గవర్నర్‌తో జగన్ సర్కార్ చెప్పిస్తోందని టీడీపీ ఆరోపణలు చేస్తోంది. పదే పదే గవర్నర్ ప్రసంగానికి టిడిపి సభ్యులు అడ్డు తగులుతూనే ఉన్నారు. చివరికి సభ నుంచి వాకౌట్ చేసేశారు. మొత్తానికి ఏపీ అసెంబ్లీ సమావేశాలు సజావుగా సాగేలా లేవు.