నాని దసరా మూవీ ఫస్ట్ డే కలెక్షన్స్…,!

-

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని హీరోగా.. మహానటి కీర్తి సురేష్ హీరోయిన్గా నటించిన చిత్రం దసరా.. మార్చి 30వ తేదీన శ్రీరామనవమి సందర్భంగా పాన్ ఇండియా వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మొదటి రోజే భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ప్రీమియర్ షో తో పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా నిన్న థియేటర్ లు హౌస్ ఫుల్ తో రన్ అయ్యాయి. ఇకపోతే మొదటి రోజుకు గాను ఎంత కలెక్షన్స్ రాబట్టింది అనే విషయాన్ని ఇప్పుడు చూద్దాం…

ముఖ్యంగా దసరా మూవీ రెండు తెలుగు రాష్ట్రాల కలెక్షన్స్ మనం చూసినట్లయితే..
నైజాం – రూ. 6.78 కోట్లు
సీడెడ్ – రూ.2.36 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ.1.42 కోట్లు
ఈస్ట్ – రూ.90 లక్షలు
వెస్ట్ – రూ. 55 లక్షలు
గుంటూరు – రూ.1.22 కోట్లు
కృష్ణ – రూ. 64 లక్షలు
నెల్లూరు – రూ.35 లక్షలు

ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ టోటల్ కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.14.22 కోట్లు

మొత్తంగా 24.85 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. కొన్ని ప్రదేశాలలో రూ.60 లక్షల కలెక్షన్స్ వసూలు చేసినట్లు సమాచారం. మొత్తానికైతే మొదటి రోజు ఎక్స్పెక్టేషన్స్ కు మించి కలెక్షన్స్ వసూలు చేసింది ఈ సినిమా. ఇక నాని కెరియర్ లోనే ఇది ఒక బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ కాబోతోందని చెప్పవచ్చు.

నాని ఇప్పటివరకు గ్లామర్ పాత్రలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తూ.. ఇప్పుడు విభిన్నమైన కథలను ఎంచుకోవడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు.. అయితే ఈసారి మాత్రం పూర్తిగా డి గ్లామరస్ పాత్ర పోషించి అందరిని అలరించాడు. ఇందులో ప్రతి సీను కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుందనే చెప్పాలి. మొత్తానికి అయితే నాని దసరా సినిమాతో దసరా పండగ చేసుకుంటున్నారు అని అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news