నేను BRSతో పొత్తు ఉంటుందని చెప్పలేదు – జానారెడ్డి

-

నేను BRSతో పొత్తు ఉంటుందని చెప్పలేదని కాంగ్రెస్‌ సీనియర్‌ నేత జానారెడ్డి తెలిపారు. నిన్న నా నివాసంలో జరిగిన ప్రెస్ మీట్ లో దేశంలో ప్రజాస్వామ్యాన్ని బీజేపీ.ప్రభుత్వం ఖునీ చేస్తున్న అంశం అని తెలిపారు. రాహుల్ గాంధీ పై ఎంపీ గా అనర్హత వేటు వేయడం, ఆధాని లాంటి వాళ్ళు ప్రజాధనాన్ని లక్షల కోట్లు దోచుకొని పోవడం లాంటి అంశగాలపై మాట్లాడడం జరిగిందన్నారు.

ఈ సందర్భంగా మీడియా ప్రతినిధులు పొత్తులపై ప్రస్తావించినపుడు నేను క్లుప్తంగా మాట్లాడానని వివరించారు. ప్రజాస్వామ్య పరిరక్షణకు బీజేపీ కి వ్యతిరేకంగా 17 రాజకీయ పార్టీలు కాంగ్రెస్ తో కలిసి పోరాటం చేస్తున్నాయని ఆ అంశాన్ని స్వాగతిస్తున్నానని మాత్రమే చెప్పానని పేర్కొన్నారు. నేను బీఆర్ ఎస్ తో పొత్తు ఉంటుందని చెప్పలేదన్నారు జానారెడ్డి. పోతుల విషయం అధిష్టానం నిర్ణయం మేరకు ఉంటుంది. అధిష్టానం నిర్ణయమే మాకు శిరోధార్యమని చెప్పారు జానారెడ్డి.

Read more RELATED
Recommended to you

Latest news