బిఆర్ఎస్ ప్రభుత్వం పై తీవ్ర విమర్శలు చేశారు మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. ఖమ్మం జిల్లా మధిరలో క్యాంపు కార్యాలయాన్ని ప్రారంభించారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. అనంతరం పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ.. కొత్తగూడెం సభలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీల చిట్టా అమలు చేయని చిట్టా మొత్తం విప్పుతానని అన్నారు.
రెండు జాతీయ పార్టీల ముఖ్య నాయకులు తనతో ప్రతిరోజు టచ్ లో ఉంటున్నారని తెలిపారు పొంగులేటి. కెసిఆర్ ధనిక రాష్ట్రమైన తెలంగాణను దివాలా దిశగా తీసుకెళ్లారని ఆరోపించారు. టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో ఎంతవరకు విచారణ సజావుగా సాగిందో ప్రజలకు తెలుసన్నారు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు పదివేల రూపాయలు పంట నష్టపరిహారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించినా.. ఇంతవరకు అమలు చేయలేదని మండిపడ్డారు.
రాబోయే ఎన్నికల్లో మధిరను శీనన్నకు గిఫ్ట్ గా ఇయ్యాలని కోరారు పొంగులేటి. మాయమాటలతో రెండుసార్లు గెలిచిన ముఖ్యమంత్రి మూడోసారి కలకంటున్నాడని.. అది కలగానే మిగులుతుందన్నారు. రాబోయే ఎన్నికల్లో మాయమాటలతో వచ్చే వారికి నోటితో కాకుండా ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు.