2500 కేజీల బియ్యంతో సోనూసూద్‌ ఫొటో.. వీడియో వైరల్

-

సోనూసూద్‌ ఈ పేరు వింటే ఒకప్పుడు సినిమాల్లో హీరోయిన్లను వేధించే ఆకతాయి.. హీరోలను ముప్పు తిప్పలు పెట్టే విలన్​ గుర్తొచ్చేవాడు. కానీ కరోనా సమయంలో ప్రపంచ మంతా లాక్​డౌన్​లో ఉంటే.. ఆపద్బాంధవుడిలా వలస కార్మికులను ఆదుకుని తమ స్వస్థలాలకు పంపించి రియల్ హీరో అనిపించుకున్నాడు. అప్పటి నుంచి ఈ రీల్ విలన్ కాస్త రియల్ లైఫ్ హీరో అయిపోయాడు.

కేవలం లాక్​డౌన్​లోనే కాదు ఆ తర్వాత కూడా సోనూ సాయం చేసే తన గుణాన్ని వదిలిపెట్టలేదు. సాయం కోరుతూ ఎవరు తలుపుతట్టినా క్షణం ఆలోచించకుండా తనకు చేతనైనంతలో సాయం చేస్తూ వస్తున్నాడు. అందుకే చాలా మంది అభిమానులు, సోనూ ద్వారా సాయం పొందిన వారు తమకు వీలైన మార్గంలో సోనూకు కృతజ్ఞతలు చెబుతున్నారు.

తాజాగా మధ్యప్రదేశ్‌లో సోనూసూద్‌ అభిమానులు చేసిన పని అందరినీ ఆకట్టుకుంటోంది. 2500 కేజీల బియ్యంతో ఆయన రూపాన్ని తీర్చిదిద్దారు. ప్లాస్టిక్‌ షీట్‌ను నేలపై పరిచి దానిపై బియ్యంతో సోనూసూద్‌ చిత్రాన్ని రూపొందించారు. తుకోజీరావు పవార్‌ స్టేడియంలో ఎకరం స్థలంలో ఈ చిత్రాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఈ బియ్యాన్ని ఓ అనాథాశ్రమానికి ఇస్తున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

 

Read more RELATED
Recommended to you

Latest news