ఫోన్‌కు చార్జింగ్ పెట్టి పడుకున్న యువతి.. ఆ త‌ర్వాత…

-

సాధార‌ణంగా చాలా మంది ఫోన్ చార్జింగ్ పెట్టి యూజ్ చేయ‌డం, చార్జింగ్ పెట్టి వ‌దిలేయం చేస్తుంటారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఇది ఎంత ప్ర‌మాద‌మ‌ని చెప్పినా.. ఎవ‌రు పాటించ‌రు. ఇలాంటివి చేయ‌డం వ‌ల్ల చాలా మంది గాయాలు పాల‌వ‌డం, ప్రాణాలు కోల్పోవ‌డం కూడా జ‌రుగుతుంది. ఇక తాజాగా కజికిస్థాన్‌కు చెందిన 14 ఏళ్ల బాలిక సెల్‌ఫోన్ పేలి మృతిచెందింది. వివరాల్లోకి వెళ్తే.. కజికిస్థాన్‌లోని బెస్టోబ్ ప్రాంతానికి చెందిన బాలిక రాత్రి పాటలు విని ఫోన్‌కు చార్జింగ్ పెట్టి నిద్రపోయింది.

ఇక తెల్లవారుజామున సెల్‌ఫోన్ చార్జింగ్ ఫుల్ అయిపోయి బ్యాటరీ హీట్ ఎక్కిపోవడంతో.. ఒక్కసారిగా పేలిపోయింది. బాలిక సెల్‌ఫోన్‌ను తల దగ్గరే పెట్టుకుని నిద్రపోవడంతో.. తలకు బలమైన గాయాలై అక్కడికక్కడే మృతిచెందినట్టు చెబుతున్నారు. అయితే సెల్‌ఫోన్ ఏ కంపెనీకి చెందినది అనేది తెలియాల్సి ఉంది. కాగా, సెల్‌ఫోన్‌ను చార్జింగ్ పెట్టి నిద్రపోవద్దంటూ మొబైల్ కంపెనీలు కూడా హెచ్చరిస్తూనే ఉన్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ఇలాంటి సంఘ‌ట‌న‌లు ఇంకా జ‌ర‌గ‌డం గ‌మ‌నార్హం.

Read more RELATED
Recommended to you

Latest news