నిబంధనలకు అనుగుణంగా పారదర్శకంగానే బదిలీలు చేస్తామన్నారు మంత్రి బొత్స సత్యానారాయణ. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రేపట్నుంచే బదిలీల ప్రక్రియ ప్రారంభమౌతుందని, 1746 పీజీ టీచర్స్ రీ డిప్లాయిమెంట్ ప్రక్రియ కూడా రేపట్నుంచే ప్రారంభిస్తామన్నారు. అంతేకాకుండా.. ‘6249 మంది ఎస్.జీ.టీ టీచర్లకు ప్రమోషన్స్ ఇస్తాం. 117 జివో ద్వారా ప్రభావితం అయిన వారికి అదనంగా 5 పాయింట్లు, పాత స్టేషన్ పాయింట్లు కేటాయిస్తాం. దయచేసి ఎవరూ న్యాయస్థానాలకు వెళ్లి ఈ ప్రక్రియకు అడ్జుపడొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రక్రియ సజావుగా సాగేందుకు అందరూ సహకరించాలి. ట్రాన్స్ ఫర్స్ పూర్తి చేసిన తర్వాతే …ప్రమోషన్లు. పేదలకు ఇళ్ళు ఇవ్వాలని జగనన్న నిర్ణయించారు. ఇది ప్రభుత్వ విధానంలో భాగం.
బీ.ఆర్.అంబేద్కర్ రాజ్యాంగ విధాననాన్ని అనుసరిస్తూ ఇచ్చిన తీర్పు పేదల హక్కు. పనులు చేసుకోవడానికి పేదలు వెళ్ళడానికి రవాణా అభివృద్ధి చేస్తాం. పేదల ఇళ్ళ వద్ద మౌళిక సదుపాయాలు కల్పిస్తాం.. అచ్చెం నాయుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి మాట్లాడతాడు పేదలందరినీ ఖాళీ చేయిస్తాడా.. రమ్మనండి… చేయమనండి.. R-5 జోన్ గురించి ఏంవాదనలు చేసినా… సుప్రీం కోర్టు తీర్మానం ఇచ్చేసింది. రాజీయ పార్టీలా వాళ్ళు సాధువులా… ఊసరవెల్లి లా జనసేన, బిజెపి, టిడిపి రంగులు మారుస్తారు. పవన్ ఒక మహానటుడు.. ఆయన జిమ్మిక్కులు అందరి మీద ప్రదర్శిస్తున్నాడు.. ఫైనల్ గా ప్రజలు కదా తేల్చేది. మా పార్టీకి ముందస్తు ఆలోచన లేదు.. దేశం మొత్తం వస్తే చూద్దాం. కొందరు వాపును చూసి బలుపు అనుకుంటున్నారు.’ అని ఆయన అన్నారు.