పెళ్లి నుంచి యువకుడు జంప్‌..20 కి.మీ వెంబడించి మరీ పెళ్లి చేసుకున్న యువతి..!!

-

ఈరోజుల్లో ప్రేమించడం.. తీరా పెళ్లి చేసుకోవాల్సి వచ్చినప్పుడు హ్యాండ్‌ ఇచ్చి వేరే వాళ్లను చూసుకోవడం చాలా మందికి అలవాటు అయిపోయింది. కొంతమంది మన కర్మ ఇంతేలే అనుకుని సర్దుకుపోతున్నారు. ఇంకొంతమంది రివేంజ్‌ తీసుకుంటున్నారు. మొన్ననే.. ప్రేయసి వేరే వాళ్లను పెళ్లిచేసుకుంటుందని ఓ ప్రియుడు ఆమెను కాల్చేశాడు.. ఇప్పుడు జరిగింది.. ఇంకా హైలెట్… పోలీసులు ఛేస్‌ చేసినట్లు తన ప్రియుడిని 20కిలో మీటర్లు చేస్‌ చేసి మరీ పట్టుకుని పెళ్లిచేసుకుంది ఆ యువతి..!

ఉత్తరప్రదేశ్‌ బరేలీలో ఓ విచిత్రమైన కేసు వెలుగులోకి వచ్చింది. గత కొద్దిరోజులుగా ప్రేమించుకుంటున్న యువతి, యువకులు పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారు. అందులో భాగంగానే స్థానికంగా ఉన్న గుడిలో పెళ్లి చేసుకుందామనుకున్నారు. అదే రోజు ప్రేమికుడి మూడ్ మారిపోయింది. పెళ్లి చేసుకోవడానికి గుడికి వెళ్లాల్సిన వాడు పారిపోయాడు.

పెళ్లి చేసుకుందామని చెప్పిన తర్వాత ప్రియురాలు కంగారు పడింది. నిజంగా పెళ్లి చేసుకునేందుకు వస్తాడా అని అనుమానం వచ్చి ఫాలో అయింది. సుమారు అతడిని దాదాపు 20 కిలోమీటర్ల దూరం వెంబడించి బస్సులో నుంచి దించి గుడి వద్దకు తీసుకొచ్చింది.. అక్కడి నుంచి ప్రియుడ్ని నేరుగా గుడికి తీసుకొచ్చింది.. ఇక గుళ్లో.. సుమారు రెండు గంటల పాటు హైడ్రామా నడిచింది. ఆ తర్వాత ప్రేమికుడిని బలవంతంగా గుడిలో ప్రియుడితో ప్రియురాలి పెళ్లి జరిపించారు అమ్మాయి పెద్దలు.

బరేలీకి చెందిన ఓ యువతి బదౌన్ జిల్లాకు చెందిన ఓ యువకుడితో రెండున్నరేళ్లుగా ప్రేమలో ఉంది. అతడితో శారీరక సంబంధం పెట్టుకుంది. ఇరువురి ఇళ్లలో పెళ్లి చర్చలు ప్రారంభం కావడంతో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఇద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయించారు. సోమవారం రామనగర రోడ్డులోని భూతేశ్వరనాథ్ ఆలయంలో యువతి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహానికి ఏర్పాట్లు చేశారు. మరీ కథ అంతా బానే ఉంది.. ఇంతలో ఆ ప్రియుడికి ఏం రోగం వచ్చిందో.. మూడ్ ఒక్కసారిగా మారి గుడిలోకి ప్రవేశించకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించాడు.

అతను ఆలయానికి రాకపోవడంతో పెళ్లికూతురు తన ప్రియుడికి ఫోన్ చేయగా.. తల్లిని తీసుకురావడానికి బుదౌన్‌కు వెళ్తున్నానని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న ఆమె కూడా అతడు వెళ్తున్న దారిలో బస్సును వెంబడించి సుమారు 20 కి.మీ దూరంలో బస్సులో ఉన్న ప్రియుడిని పట్టుకుని మళ్లీ గుడికి తీసుకొచ్చింది.. అప్పటికే జనాలు గుమిగూడటంతో.. మనోడు చేసేదేం లేక పెళ్లి చేసుకున్నాడు.! ఇప్పుడు ఈ ఛేసింగ్‌ మ్యారెజ్‌ నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది.!

Read more RELATED
Recommended to you

Latest news