బంగారం పరిమితి పథకంపై కేంద్రం క్లారిటీ..!

-

దేశంలో నల్లధనం నిర్మూలనకు మూడేళ్ల క్రితం పెద్ద నోట్లయిన వెయ్యి, ఐదువందల డినామినేషన్లను రద్దు చేసి సంచలన నిర్ణయం తీసుకున్నమోదీ ప్రభుత్వం తాజాగా నల్ల ధనాన్ని బంగారం రూపంలో దాచిపెట్టిన వారిపై దృష్టి పెట్టారంటూ వార్త‌లు వ‌చ్చాయి. అయితే పరిమితికి మించి బంగారం ఉంటే దాన్ని స్వచ్ఛందంగా వెల్లడించేందుకు ఓ సరికొత్త పథకం తీసుకురానున్నట్లు వస్తున్న వార్తలను ఆర్థికశాఖ వర్గాలు కొట్టిపారేశాయి. బంగారంపై క్షమాభిక్ష పథకం తీసుకురావాలన్న ప్రతిపాదనేదీ లేదని తేల్చిచెప్పాయి. బడ్జెట్‌ తయారీ సందర్భంగా ఇలాంటి ఊహాగానాలు రావడం సహజమేనని సంబంధిత అధికారులు తెలిపారు.

నల్లధనాన్ని బంగారం రూపంలో దాచుకునేవారిని కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సరికొత్త క్షమాభిక్ష పథకానికి రూపకల్పన చేస్తున్నట్లు ఊహాగానాలు వచ్చాయి. నిర్ణీత పరిమాణానికి మంచి బంగారం ఉంటే స్వచ్ఛందంగా తెలియజేసేలా ఈ పథకాన్ని అమలు చేయనున్నట్లు కథనాలు వచ్చాయి. దీని ప్రకారం.. పరిమితికిమించి బంగారం ఉన్నవారు దానిని బయటపెట్టి, పన్ను చెల్లించాల్సి ఉంటుందని ప్రచారం జరిగింది. దీనిపై స్పందించిన అధికారిక వర్గాలు.. అలాంటి ఆలోచనేమీ లేదని స్పష్టం చేశాయి.

Read more RELATED
Recommended to you

Latest news