పెట్రోల్ ఇంత భయంకరమా…? 30 సెకన్లలోనే… అంతా నాశనమేనా…?

-

పెట్రోల్ బ౦కుల్లో ఫోన్ మాట్లాడొద్దని, దాని కారణంగా భారీ నష్టం జరుగుతూ ఉంటుందని నిపుణులు సాక్ష్యాలతో సహా నిరూపిస్తూ ఉంటారు. చాలా మంది వీటిని పట్టించుకోకుండా ఫోన్ మాట్లాడి ప్రమాదాల బారిన పడుతూ ఉంటారు. తాజాగా తెలంగాణాలో జరిగిన ఎమ్మార్వో హత్యతో పెట్రోల్ ఎంత భయంకరమైనదో అర్ధమైంది. నిందితుడు ఆమెపై పెట్రోల్ పోయడం, అంటించడం ఆమె క్షణాల్లో ఆహుతి అయిపోవడం జరిగింది. దీనిపై నిపుణులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ పెట్రోల్ ఎంత భయంకరమైన ఇంధనమో చెప్తున్నారు…

పెట్రోల్ అత్యంత వేగంగా అంటుకుంటుందట. క్షణాల్లో మంటలు తీవ్రంగా వ్యాపిస్తూ ఉంటాయట. అది కట్టెల మీద మండటం కంటే మనిషి శరీరం మీద ఎక్కువగా మండుతుందని అంటున్నారు. అందుకే తెలంగాణా కోసం ఆత్మాహుతి చేసుకున్న శ్రీకాంతా చారి క్షణాల్లోనే ఆహుతి అయిపోయాడని చెప్తున్నారు. మంట, అత్యధిక ఉష్ణోగ్రత, గదిలోకానీ ఆరుబయట కానీ ఆక్సీజన్ ఎక్కువగా ఉంటె మంట మరింత ఎక్కువగా వస్తుందని అంటున్నారు. మనిషి శరీరంపై ఉండే కొన్ని లక్షణాల కారణంగా 30 సెకన్లకు మించి మండితే అది ప్రాణాపాయమే అంటున్నారు.

రెండు నిమిషాలలోపు మంటలను ఆర్పాలని లేకపోతే మాత్రం ప్రాణం పోవడం ఖాయమట. మనిషి శరీరంపై ఉండే చర్మంలో కొవ్వు ఉంటుందని అది పెట్రోల్ ని ఎక్కువగా ఆకర్షిస్తుందని అందుకే మంట ప్రభావం అలా ఉంటుందని అంటున్నారు. ప్రమాదానికి గురైన బాధితులకు గాలి ఆడకుండా ఉంటుందని అందుకే మరణాల శాతం ఎక్కువగా ఉంటుందని అభిప్రాయపడుతున్నారు. ఇక ఇలాంటి ఘటనల విషయంలో సమీపంలో ఉన్న వారు చాలా జాగ్రత్తగా ఉండాలని, మంటలను ఆర్పే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రాణాలు కోల్పోవడం ఖాయమని అంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news