రాష్ట్రంలో జగన్ ప్రభుత్వం లేవనెత్తిన మూడు రాజధానుల విషయం ఆందోళనలను రగిలిస్తోంది. ము ఖ్యంగా రాజధాని జిల్లా గుంటూరులో తీవ్ర వ్యతిరేకత వస్తోంది. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ప్రజ లు, రైతులు కూడా రోడ్ల మీదకు వచ్చి వారం పది రోజులుగా నిరసనలు, ఆందోళనలను చేస్తున్నారు. ప్ర భుత్వంపై తీవ్ర విమర్శలు కూడా చేస్తున్నారు. అదేసమయంలో జగన్‌పైనా దుమ్మెత్తిపోస్తున్నారు. సరే.. ప్రజాస్వా మ్యంలో నిరసనలు, ఆందోళనలు,ధర్నాలు వంటివి ప్రజలకు హక్కుగనుక ఈ విషయంలో పెద్ద గా చర్చలే దు. అయితే, ఈ ఆందోళనల పర్వం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఎందుకు ఇక్కడి వా రు నిరసనలు చేస్తున్నారు? అనే విషయం మాత్రం చర్చ నిలబడుతున్న ప్రధాన అంశం.
ఇక్కడి ప్రజలు రాజధాని కోసమే తాము రోడ్డెక్కామని చెబుతున్నారు. ఇక, ఈ ఆందోళనల వెనుక ఉన్న ప్ర ధాన ప్రతిపక్షం సహా ఇతర పక్షాలు.. తాము రైతుల కోసమే రోడ్డెక్కి, ఇక్కడి వారికి మద్దతిచ్చామని చెబుతు న్నారు. రైతులకు అన్యాయం చేస్తే.. సహించేది లేదని కూడా హెచ్చరికలు చేస్తున్నారు. దీంతో ఈ ఆందోళనల నేపథ్యంలో రెండు విషయాలు స్పష్టంగా తెరమీదికి వచ్చినట్టయింది. ఒకటి రైతుల కోసం, రెండు రాజధాని కోసం అనే వాదన బలంగా తెలుస్తోంది. తొలుత ఇక్కడ ప్రజల వాదనను పరిశీలిస్తే.. మేమంతా ప్రభుత్వానికి రాజధాని కోసం భూములు ఇచ్చాం.. కాబట్టి ఇక్కడే రాజధాని ఉండాలి.. లేకపోతే.. మా పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుంది అంటున్నారు.
నిజానికి ఈ వాదనలో పెద్దగా పస ఉన్నట్టు కనిపించడం లేదు. రాజధాని కోసం ఇక్కడి వారు ప్రభుత్వానికి భూములు ఇచ్చారు. అయితే, దీనికి సంబంధించిన పరిహారం కూడా తీసుకున్నారు. అదే సమయంలో కౌలు తీసుకుంటున్నారు. పింఛన్లు కూడా పొందుతున్నారు. ఇక, ఇక్కడ రాజధాని ఏర్పాటయినా.. వారికి ప్రత్యక్షంగా ఏమీ సంబంధాలు ఉండే అవకాశం లేదు. ఇకపోతే.. ప్రస్తుత ప్రభుత్వం ఇప్పటి వరకు వినియోగించిన భూములు ఉంచుకుని, మిగిలిన నిరుపయోగంగా ఉన్న బూమలను తిరిగి ఇచ్చేస్తామని కూడా చెబుతోంది.
అదే సమయంలో ప్రభుత్వం నుంచి తీసుకున్న పరిహారం విషయాన్ని ఎక్కడా ప్రస్తావించడం కూడా లేదు. సో.. దీనిని బట్టి.. అమరావతిలో భూములు ఇచ్చిన వారికి వచ్చే నష్టం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. ఇక, రైతుల విషయాన్ని పరిశీలిద్దాం.. అమరావతిలో తమ భూములను ప్రభుత్వానికి ఇచ్చి తాము ఇబ్బంది కొని తెచ్చుకున్నామని అంటున్న రైతులకు ప్రతిపక్షాలు మద్దతిస్తున్నాయి. మంచిదే! ఎవరైనా రైతుల పక్షపాతిగానే ఉండాలని కోరుకుంటారు. అయితే, రాష్ట్రంలో రైతులు నష్టపోయిన ఘటన కేవలం అమరావతిలోనే జరుగుతోందా ? పోలవరం సహా అనేక ప్రాజెక్టులకు, జాతీయ రహదారులకు, బహుళ ప్రయోజనాల ప్రాజెక్టులకు తమ భూములు, పొలాలను త్యాగం చేసిన రైతులు ఉన్నారు. దళితులు ఉన్నారు. మరి వారికి ఇప్పటికీ న్యాయం జరగలేదు.
మరి ఇప్పుడు వీరి పక్షాన ఉద్యమం చేస్తున్న ప్రతిపక్షాలకు వారు గుర్తుకు రావడం లేదా? అంటే.. రాజధాని కేంద్రంగా వీటిని మించిన `విషయం` ఏదో నిగూఢంగా ఉందనేది మేధావుల మాట..! ప్రయోజనాలు వేరే ఉన్నాయనేది వీరి అంచనా!! సో.. అది తేలే వరకు ఈ అమరావతి ఉద్యమం.. ఉద్యమంగానే ఉంటుంది తప్ప.. విస్తృత ప్రజా ప్రయోజనంగా మాత్రం ఉండే అవకాశం లేదని అంటున్నారు విశ్లేషకులు.